T20 World Cup 2022 : ఈ సారి ఇండియా ఎలాగైన కప్పు కొడుతుందని ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కాని వారి ఆశలన్నీ సెమీస్‌లోనే ఆవిరి చేశారు. అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్టా అనే పాట చందంగా తయారైంది మన టీమిండియా పరిస్థితి. ఓటమి తర్వాత టీమిండియా ఎక్కడ చతికిల పడింది అనే దానిపై విశ్లేషణలు చేస్తున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా ? అనుకున్న ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడంలో రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడా ? ఇవేవీ కాకుండా ఆటగాళ్ల వైఫల్యమే భారత్ కప్ గెలవాలన్న ఆశల్ని అడియాశలు చేసిందా ? అనే దానిపై చర్చలు జరుపుతున్నారు.
పవర్‌ప్లేలో బ్యాటింగ్ విధానం, కొత్త బంతితో అద్భుతాలు చేయకపోవడం వల్లనే రోహిత్-శర్మ నాయకత్వంలోని జట్టు నిష్క్రమించింది. స్ట్రైక్ బౌలర్ లేకపోవడం పెద్ద మైనస్. అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో వికెట్స్ తీయాలి. మిడిల్ ఓవర్స్‌లో స్పిన్‌తో అటాక్ చేయాలి.కాని ప్రారంభంలో వికెట్లు రాని కారణంగా ఇంగ్లండ్ ఓపెనర్స్ రెచ్చిపోయి ఆడారు. గాయపడిన జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరు కావడం భారత్‌కి చాలా మైనస్ అయింది. ఇక భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ మరియు పాండ్యా ,అక్షర్ పటేల్ ఓవర్‌కి పదికి పైగా పరుగులు ఇచ్చారు.
ఈ సిరీస్‌లో ఓపెనింగ్ ప్రధాన సమస్యగా మారింది. కేఎల్ రాహుల్ మొదటి మూడు మ్యాచుల్లోనూ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఆ మూడు మ్యాచులు కూడా టీమిండియాపై ఒత్తిడి ఉన్నవే. ఆ తర్వాత రెండు బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఆ రెండూ కూడా ఒత్తిడి లేని మ్యాచులే. మళ్లీ ఇప్పుడిలా గెలిసి తీరాల్సిన మ్యాచుల్లోనూ కేఎల్ రాహుల్ 5 బంతుల్లో 5 పరుగులకే వెనుదిరిగాడు. పవర్‌ప్లేలలో భారత్ బ్యాటింగ్ చెత్తగా ఉంది. ఇక కాస్త ఏజ్ ఉన్న క్రికెటర్స్ విషయానికి వస్తే.. రోహిత్ శర్మకు ఇప్పటికే 35 ఏళ్లు కాగా, విరాట్ కోహ్లికి 34 ఏళ్లు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ వయసు 32. దినేష్ కార్తీక్ వయస్సు 37. మహ్మద్ షమీ మరియు భువనేశ్వర్ కుమార్ ఇద్దరికీ 32 ఏళ్లు. కోహ్లి మినహా, ఈ ఆటగాళ్లలో ఎవరూ వారు ఆశించిన స్థాయిలో రాణించలేదు.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ మొత్తం 6 మ్యాచ్‌లు ఆడింది (సూపర్ 12లలో 5 మరియు 1 సెమీ-ఫైనల్). 15 మందితో కూడిన జట్టులో ఏకైక మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ని ఏ మ్యాచ్‌లో ఆడించలేదు. రవిచంద్రన్ అశ్విన్ మరియు అక్షర్ పటేల్ ఇద్దరూ టోర్నమెంట్ మొత్తం ఉన్నారు. కాని బ్యాట్స్ మెన్స్ పై ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…