Yashoda Movie Review : స‌మంత న‌టించిన య‌శోద మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉంది.. హిట్టా.. ఫ‌ట్టా..?

Yashoda Movie Review : స్టార్ హీరోయిన్ స‌మంత కెరీర్‌లో ఎన్నో ప్ర‌యోగాలు చేసిన సంగ‌తి తెలిసిందే. యూట‌ర్న్, ఓ బేబి చిత్రాల‌తో స‌మంత లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌తోను తాను ఆక‌ర్షిస్తాన‌ని నిరూపించింది. ఇప్పుడు య‌శోద‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. .సమంత కొద్దీ రోజుల నుండి తనకి ఉన్న మయోసిటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న విషయం మనకి తెలిసిందే..అయితే చికిత్స తీసుకుంటూ కూడా ఆమె మధ్యలో సినిమాకి డబ్బింగ్ చెప్పడమే కాకుండా ప్రొమోషన్స్ లో కూడా పాల్గొంది..భారీ అంచ‌నాల‌తో నేడు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, మూవీ ఎలా ఉందో చూద్దాం.

కథ :

మ‌ధ్య‌త‌ర‌గ‌తి మ‌హిళ‌ల‌ను టార్గెట్ చేస్తూ.. సరోగసి తల్లులుగా మారుస్తూ ఓ మాఫియా న‌డుపుతుంటారు కొంద‌రు ధ‌న‌వంతులు. ఈ క్ర‌మంలోనే ఓ ల్యాబ్ ఒక పెద్ద మాఫియా తో డీల్ కుదిరించుకుంది.ఆ మాఫియా చేసే అకృత్యాల వల్ల బలైన ఎంతోమంది యువతులతో ఒకరు యశోద..అసలు సరోగసి పేరు మీద అక్కడ చేస్తున్న అక్రమ వ్యాపారం ఏమిటి..? సరోగసి తల్లులుగా మారిన స్త్రీలను ఏమి చేస్తున్నారు..? య‌శోద స‌రోగ‌సి మాఫీయా నుండి ఎలా బ‌య‌ట‌ప‌డింది అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

Yashoda Movie Review in telugu know how is it
Yashoda Movie Review

విశ్లేష‌ణ‌:

య‌శోద సినిమా కోసం స‌మంత‌ ఎంతో కష్టపడింది. అనారోగ్యాన్నిసైతం లెక్కచేయకుండా సినిమా కోసం తాపత్రేయపడింది. సెలైన్ ఎక్కుతుండగానే.. డబ్బింగ్ చెప్పుకుంది. చిత్రంలో సమంత పెర్ఫామెన్స్ కు నిరాజనాలు పలుకుతున్నారు ఆడియన్స్. సామ్ కష్టానికి బాగా కనెక్ట్ అయ్యారు … కదిలిపోయారు. ఆరోగ్యం సహకరించకపోయినా.. ఆమె నటనలో ఏమాత్రం అదికనిపించకుండా అద్భుతం చేసింది. ఇక ఆమె తోటి న‌టీన‌టులు ,ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ కూడా అద్భుతంగా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ఇక యశోద సినిమాతో మరోసారి రెచ్చిపోయాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ముఖ్యంగా ఆయన ఈసినిమాకు ఇచ్చిన బీజీఎంకి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. సినిమాని చూస్తునంత సేపు ప్రేక్షకులకు ఉత్కంఠ కలగడమే తప్ప బోర్ మాత్రం కొట్టదు..అంత ఆసక్తికరంగా ఈ మూవీ స్క్రీన్ ప్లే సాగుతుంది .హ‌రి- హ‌రీష్‌. క‌థ‌, స్క్రీన్ ప్లే విష‌యంలోచాలా జాగ్ర‌త్తలు తీసుకున్న‌ట్టు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది..

ప్ల‌స్ పాయింట్స్:

  • సమంత నటన
  • స్క్రీన్ ప్లే
  • ఇంటర్వెల్ బ్యాండ్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్:

  • స్లోగా సాగిన స్క్రీన్ ప్లే

చివ‌రిగా..

ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన యశోద చిత్రం ఆద్యంత ఆస‌క్తిక‌రంగా సాగింది. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా సాగగా, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మరో ఆకర్షణగా చెప్ప‌వ‌చ్చు. సరోగసీకి బలవుతున్న అమాయకపు మహిళల గురించి చిత్రంలో ఆద్యంతం ఆస‌క్తిగా చూపించారు. ఇది కచ్చితంగా థియేటర్స్ లో అనుభూతి చెందాల్సిన సినిమా.

రేటింగ్ 2/5.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago