Suzuki Swift 2024 : ఇటీవల కాలంలో కార్ సేఫ్టీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఎన్ని కోట్ల ఖర్చు పెట్టిన కూడా సేఫ్టీ అనేది కచ్చితంగా ఇవ్వలేకపోతున్నారు.అయితే కొత్త స్విఫ్ట్ జపాన్ NCAP క్రాష్ టెస్ట్‌లో 99 శాతం స్కోర్ చేసింది. దీనికి ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కడం విశేషం. ఈ కారుకి వందకి గాను 81.10 మార్కులు వచ్చాయి. ఇక ఈ కారుకి సైడ్ ఢీకొన్నా, ఫ్రంట్ ఢీకొన్నా కూడా ఆక్యుపెన్సీ భద్రత బాగా ఉంటుంది. ఆటోమేటిక్ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ కాల్ సిస్టమ్, సేఫ్టీ పనితీరు కూడా అద్భుతంగా ఉంది.భద్రతా పరీక్షలో కూడా మంచి మార్కులే పడ్డాయి. 197కి 177.80 స్కోర్‌ను సాధించింది.
జపాన్‌లో ప్రారంభించిన సుజుకి స్విఫ్ట్ ADAS భద్రతా లక్షణాలతో వస్తుంది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ హై బీమ్ అసిస్ట్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, డ్యూయల్ సెన్సార్ బ్రేక్ సపోర్ట్, లేన్ కీప్ అసిస్ట్ ఫంక్షన్, రోడ్ సైన్ రికగ్నిషన్, బ్లైండ్ స్పాట్ మానిటర్, 360 డిగ్రీ కెమెరా, రియర్ క్రాస్ ట్రాఫిక్ నోటిఫికేషన్ అలర్ట్, స్టార్ట్ వంటి ఫీచర్లతో ఈ కారు ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొత్త తరం మారుతి స్విఫ్ట్ మే 9న భారత మార్కెట్లో విడుదల కానుండగా, దీని పొడవు 3860mm, వెడల్పు 1695mm మరియు ఎత్తు 1500mm. ఇందులో కొత్త స్విఫ్ట్ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.2 లీటర్, Z-సిరీస్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ప్రస్తుత స్విఫ్ట్ మోడల్‌లో 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంది. అప్‌డేట్ చేసిన ఇంజన్ కారణంగా, కొత్త స్విఫ్ట్ ప్రస్తుత స్విఫ్ట్ కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది.
భారతీయ మారుతి స్విఫ్ట్ క్రాష్ టెస్ట్ భారత్ NCAP చేత చేయబడింది.. భారతీయ మోడల్, జపాన్ మోడల్ భద్రత రేటింగ్లో వ్యత్యాసం ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం, మారుతి స్విఫ్ట్‌ను గ్లోబల్ NCAP కార్ క్రాష్ టెస్ట్ కోసం పంపినప్పుడు, అది పెద్దలు, పిల్లల రక్షణ కోసం 1 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను మాత్రమే సాధించింది. ఈ కారు సేఫ్టీ ఎక్కువగా ఉన్నందుకు దీనిని దక్కించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…