Suryakumar Yadav Sixes : ఆస్ట్రేలియాపై సూర్య‌కుమార్ బాదిన 4 సిక్సుల‌ను చూశారా.. వీడియో..!

Suryakumar Yadav Sixes : ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో భార‌త్ మూడు వ‌న్డేల సిరీస్ ఆడుతున్న విష‌యం తెలిసిందే. ఇండోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 2వ వన్డేలో శ్రేయాస్ అయ్యర్, గిల్ సెంచ‌రీల‌తో మెర‌వ‌గా సూర్యకుమార్ యాదవ్ సిక్సులతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 6వ నంబర్‌తో మైదానంలోకి దిగిన సూర్య.. ఆరంభం నుంచే తుఫాన్ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 44వ ఓవ‌ర్లో నాలుగు బంతుల‌కు నాలుగు సిక్సులు బాదాడు. అంతే కాకుండా కేవలం 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.విశేషమేమిటంటే, ఈ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది.

2013లో ఆస్ట్రేలియాపై కింగ్ కోహ్లి కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించ‌గా, ఇప్పుడు దానిని సూర్య బ్రేక్ చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కి వ‌చ్చిన సూర్య అద్భుత‌మైన షాట్స్ ఆడుతూ కేవ‌లం 37 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 6 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమ్ ఇండియా స్కోరు 399కి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Suryakumar Yadav Sixes he hit 4 in australia odi match
Suryakumar Yadav Sixes

ఏ బౌలర్ అనే తేడా లేకుండా బౌండరీలతో గిల్‌,శ్రేయాస్ విరుచుకుపడ్డారు. దాంతో పవర్ ప్లేలోనే టీమిండియా వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. అనంతరం ఇదే జోరును కొనసాగించిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ముందుగా శుభ్‌మన్ గిల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అయ్యర్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఇషాన్ కిషాన్(31) సైతం పర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. ఇక ఆసీస్ భారీ ల‌క్ష్యంతో బరిలోకి దిగ‌గా 215 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago