Nagababu : గత కొద్ది రోజులుగా జనసేన నాయకులు చాలా హుషారుగా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాగబాబు, మనోహర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఏపీ రాజకీయం మరింత వేడెక్కేలా చేస్తున్నారు.తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ వర్గాలతో నిర్వహించిన రెండు రోజుల ముఖా ముఖి కార్యక్రమం పూర్తి కావడంతో మీడియా సమావేశం నిర్వహించిన నాగబాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీచేయడం ఖాయం. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు.. ఎవరు మాతో ఎవరు కలిసివస్తారు.అనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తాం.
ఇక సి ఏం అభ్యర్థి ఎవరనే విషయంలో ఎన్నికల తరువాత కలిసి చర్చించుకుని నిర్ణయించుకుంటాం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు తెలిపారు. చంద్రబాబు అరెస్టు బాధ కలిగించిందన్నారు. చంద్రబాబు అరెస్టుపై జన సైనికులు ఆవేదనతో ఉన్నారన్నారు. పవన్‌ను ఎవరైనా ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతామని హెచ్చరిచారు. బిజెపితో పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. రూ.కోట్ల ఆస్తులున్న పెద్ద నేతలు జనసేనకు అక్కర్లేదన్నారు. అవినీతి పరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇవ్వబోమని.. ప్రజా సేవకులకే సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు.
చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నా కేసులు పెడుతున్నారు. కేసులకు భయపడం. మాకు చాలా స్ట్రాంగ్ లీగల్ టీం ఉంది. బిజెపి నుంచి త్వరలో నిర్ణయం వస్తుంది. జనసేనలో నాయకత్వ లోపం లేదు. 200 కోట్ల రూపాయలు దోచేసి, భయభ్రాతులను చేసే నాయకులు లేక పోవచ్చు. ఉన్న వారు మంచి నేతలే ఉన్నారు. రాయలసీమలో వారాహీ యాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మా పార్టీ తరపున ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో పవన్ కల్యాణ్ ప్రకటిస్తారు.” అని నాగబాబు అన్నారు.ఇక జనసేన కింద టీడీపీ పని చేస్తుందని మీ పేపర్లో రాస్తారా?. మీకు సమాధానం చెప్పటం కూడా వృధా అని నాగబాబు సాక్షి విలేకరితో చెప్పారు. జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా తిరుపతిలో ఎవరు పోటీ చేయాలో సాక్షి పత్రిక వాళ్లే నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…