Anil Kumar Yadav : ఏపీ అసెంబ్లీలో టీడీపీ నాయకులు చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సభ ప్రారంభంకాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టగా.. టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా.. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని.. సైకో పాలన నశించాలి అంటూ నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలపై మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అంబటి రాంబాబు మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెంట్ అంశంపై చర్చ జరుగుతుందని.. అందులో టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొనాలన్నారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదని గుర్తు పెట్టుకోవాలన్నారు.. అయినా టీడీపీ సభ్యులు నిరసన కొనసాగించారు.
సభలో బాలయ్య తీరుపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీటుపైకి ఎక్కి విజిల్ ఊదారని.. సీటు ఎక్కి ఎందుకు ఆ సీట్లో కూర్చోమంటూ బాలయ్యకు చురకలు అంటించారు. తండ్రిని చంపిన చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం ఇలా స్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత బాలయ్య ఇంటికి వెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందే అన్నారు. బాబు కళ్లలో ఆనందం చూసేందుకే బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు సీటుపై కాదు… చంద్రబాబుపై ఎక్కి కూర్చోవాలని అంబటి రాంబాబు కోరారు. టీడీపీ సభ్యులు ఇలానే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి 23 సీట్లు దక్కవన్నారు. సింగిల్ డిజిట్ మాత్రమే దక్కుతుందని మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
ఇక అనీల్ కుమార్ యాదవ్ కూడా టీడీపీ నాయకుల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సిగ్గు శరం లేదా అంటూ మండిపడ్డారు. రాజదాని గురించి మాట్లాడే సమయం ఆ రోజు మాకు ఇవ్వలేదు. ఈ రోజు గంటన్నర మాట్లాడే అవకాశం ఇస్తే వారికి సరిపోవడం లేదు. దొంగ నాటకాలు ఆడుతున్నారు. ముఖ్యమంత్రి సందేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.సిగ్గు, శరం వీళ్లకి ఉంటే ఈ పాటికి ఖాళీ చేసి అన్నా వెళతారు. లేకపోతే గమ్మున ఉంటారు. ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప రాష్ట్ర ప్రజల కోసం వారు ఆలోచించడం లేదు అని అనీల్ మండిపడ్డారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…