Nara Brahmani : స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. అక్టోబర్ 5 వరకు బాబు రిమాండ్‌లో ఉంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. బాబు అరెస్ట్ తర్వాత టీడీపీకి ఆల్టర్‌నేటివ్ అనేది ఎవరు అని సందేహాలు నెలకొన్నాయి. ఆ సమయంలో బ్రాహ్మణి తాను ఉన్నానని ముందుకొచ్చి ఇప్పుడు టీడీపీకి చాలా అండగా ఉంది. ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం రాజమండ్రిలో తాత్కాలికంగా నివాసం ఉంటోంది. ప్రస్తుతం బ్రాహ్మణి అక్కడే నివసిస్తోన్నారు.
ఆమె జనసేన తూర్పు గోదావరి జిల్లా నేతలని కలవడం, అలానే చంద్రబాబు నిరసనని ఖండిస్తున్న వారిని కలిసి పలు విషయాలు అడిగి తెలుసుకుంటుంది. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ.. టీడీపీ శ్రేణులు ఆందోళన కొనసాగిస్తుండగా మరోవైపు పార్టీలు, ప్రాంతాలకతీతంగా మద్దతు వెల్లువెత్తుతోంది. హైదరాబాద్, బెంగళూరులో ఐటీ ఉద్యోగులు ఇప్పటికే నిరసన తెలపగా, పలు చోట్ల కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. రీసెంట్‌గా బ్రాహ్మణి నిరసన తెలియజేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులని కలిసింది. ఆ సమయంలో కొందరు పవన్ కళ్యాణ్‌ని సీఎం సీట్లో కూర్చోపెట్టి అయిన జగన్‌ని తరిమి కొట్టాలని అన్నారు. అయితే పవన్‌ని సీఎంగా చేయాలని వారు అనడంతో బ్రాహ్మణి ఫేస్ ఒక్కసారిగా మాడిపోయినట్టు అయింది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నారా బ్రాహ్మణి పేరు మారుమ్రోగుతున్న సంగతి తెలిసిందే.నారా బ్రాహ్మణి రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారని ప్రజల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. బిజినెస్ ఉమెన్ గా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న బ్రాహ్మణి ప్రజల్లోకి నిజంగానే వస్తారో లేదో తెలియాల్సి ఉంది.అయితే బ్రాహ్మణి తెలుగు భాషను అనర్గళంగా మాట్లాడలేరని తెలుస్తోంది. భారతదేశానికి ఐటీని తెచ్చింది చంద్రబాబేనని చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత బ్రాహ్మణి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్టీఆర్ మనవరాలిగా, చంద్రబాబు కోడలిగా, ఏ అంశం గురించి అయినా ఇంగ్లీష్ లో అద్భుతంగా మాట్లాడే మహిళగా బ్రాహ్మణికి గుర్తింపు ఉంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…