Balakrishna : ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడం మనం చూస్తూనే ఉన్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఆ సమయంలో నందమూరి బాలకృష్ణ మీసం తిప్పటంతో ఒక్క సారిగా సభలో సీన్ మారిపోయింది. సభలో బాలకృష్ణ మీసం తిప్పటం పైన స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. తొలి తప్పుగా పరిగణిస్తున్నట్లు పేర్కొంటూ..క్షమిస్తున్నట్లు వెల్లడించారు. బాలకృష్ణ పైన మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభలో గూండాల్లా, సైకోల్లా ప్రవర్తించారని మండిపడ్డారు. స్పీకర్ చైర్ మీద గౌరవం లేకుండా స్పీకర్ చుట్టూ చేరి పేపర్లు చింపేసి మొహం మీద విసిరేశారని ఫైర్ అయ్యారు. స్పీకర్ ముందున్న మానిటర్, మంచినీటి గ్లాస్ పగులగొట్టి.. అరుస్తూ సభా సంప్రదాయాన్ని గౌరవించకుండా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
బాలకృష్ణకి సూటిగా చెప్తున్నా.. ఫ్లూట్ జింక ముందు ఊదు, సింహంలాంటి జగన్ ముందు కాదంటూ మంత్రి రోజా అన్నారు. బాలకృష్ణ సినిమా ఫంక్షన్లకు వెళ్లి ఆడపిల్లలు కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అంటారని సెటైర్లు వేశారు. బాలకృష్ణ మీసాలు మెలేస్తే ఇక్కడ భయపడేవారు ఎవ్వరు లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది రోజా. అయితే రోజా వ్యాఖ్యలపై బాలయ్య తాజాగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు. న్యాయపోరాటంతో గెలుద్దాం. జనాలలోకి వెళ్లి పోరాడదామని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో వాస్తవం ఏమాత్రం లేదు.
పిల్లల భవిష్యత్ కోసం తెలుగు దేశం కార్యకర్తలే కాదు జనం కూడా బయటకి వస్తారు. అందరు కలిసి విచ్చలవిడిగా రాష్ట్రాన్ని నాశనం చేశారు. చంద్రబాబుకు వస్తున్న స్పందన, యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి కేసు పెట్టారంటూ విమర్శించారు.రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి లేదు.. యువతకు ఉపాధి లేదంటూ బాలకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు .. చంద్రబాబును జైల్లో పెట్టడమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మీరు చేసే పనులకి ఎవడైన రియాక్ట్ అవుతాడు. నా వృత్తిని అవమానించినందుకే మీసం తిప్పాను అంటూ రోజాకి ఇతర వైసీపీ నాయకులకి గట్టిగా ఇచ్చి పడేశాడు బాలయ్య.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…