యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందాడ జూనియర్. ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత సినిమాలోని స్టార్ క్యాస్ట్ కు అలాగే దర్శకుడికి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక వీరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ ఉందో కూడా మరోసారి అర్థమయ్యింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా టీమిండియా క్రికెటర్లు కలుసుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. న్యూజిలాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టులోని కొంత మంది క్రికెటర్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను హైదరాబాద్‌లో కలిశారు.
క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్ సోమవారం సాయంత్రం ఎన్టీఆర్‌ను కలిసి ఆయనతో కాసేపు సరదాగా గడిపారు. జూనియర్ ఎన్టీఆర్‌తో భారత క్రికెటర్లు దిగిన గ్రూప్ ఫొటోలు ప్రస్తుత సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే, సూర్యకుమార్ యాదవ్, చాహల్.. ఎన్టీఆర్‌తో కలిసి తీసుకున్న ఫొటోలను ట్వీట్లు చేశారు. అలాగే, ఆర్ఆర్ఆర్ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్నందుకుగానూ ఎన్టీఆర్‌కు అభినందనలు తెలిపారు.
కాగా, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవడంతో ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకున్న తొలి ఆసియా సినిమాగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆస్కార్ అవార్డు మీద పడింది. జనవరి 24న ఆస్కార్స్ నామినేషన్స్‌ను ప్రకటిస్తారు. మరి ఈ నామినేషన్స్‌లో ఈ చిత్రం స్థానం సంపాదిస్తుందా లేదా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. గతంలోనే చాహల్ ట్రిపుల్ ఆర్ సినిమా చూసి అందులోని కొన్ని డైలాగ్స్ కు సంబంధించిన రీల్స్ కూడా చేశాడు. అతను టాలీవుడ్ ఇండస్ట్రీలోని మరి కొంతమంది హీరోల సినిమాలు చాలా చూస్తుంటాను అని ఒక ఇంటర్వ్యూలలో కూడా చెప్పాడు.