నేషనల్ క్రష్ రష్మిక మందాన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతుంది రష్మిక. బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప: ది రైజ్ తర్వాత ఆమె రేంజ్ పెరిగింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అదరగొడుతుంది. గుడ్‌బైతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుంది. ఇక తాజాగా విడుదలైన వారసుడు సినిమాతోనూ ఆకట్టుకుంది రష్మిక.
రష్మిక మందన నటించిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉంది ఈ బ్యూటీ. కెరియర్ పరంగా ఎంత బిజీబిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన ఎన్నో విషయాలను పంచుకోవడంతో పాటు తన చేతిపై ఉన్న టాటూ గురించి కూడా మాట్లాడుతూ అందరిని ఆశ్చర్యపరచింది.
మొదట నాకు టాటూ వేయించుకోవాలని ఉండేది కాదు.మా కాలేజీలో ఒక అబ్బాయి ఆడపిల్లలు బాధను ఓర్చుకోలేదు.వాళ్లకు సూదులు అన్న భయమే అని అన్నాడు.అది తప్పని నిరూపించాలని నేను వేయించుకోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చింది రష్మిక మందన.అప్పుడు టాటూ ఏం వేయించుకోవాలో తెలియలేదు. చాలాసేపు ఆలోచించిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది.ఎవరు మరొకరిని భర్తీ చేయలేరని నేను భావించాను. ప్రతి ఒక్కరూ ముఖ్యమైన వారే.అందుకే అదే అర్థం వచ్చే విధంగా ఇర్రిప్లేసబుల్ అనే పదాన్ని వేయించుకున్నాను అని తన టాటూ వెనుక రహస్యాన్ని చెప్పుకొచ్చింది రష్మిక మందన.