Supritha : టాలీవుడ్‌లో అనేక సినిమాలలో నటించి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ గా పేరు తెచ్చుకున్న నటి సురేఖా వాణి. ఒకప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న సురేఖా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. ముఖ్యంగా ఆమె కూతురితో ఈ అమ్మడు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్ మీడియా ద్వారా ఇటీవల ఈ ఇద్దరు భామలు తెగ సందడి చేస్తున్నారు. తాజాగా కూతురు సుప్రిత.. అమ్మ మనసులో ఉన్న విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం. పవన్ కళ్యాణ్‌తో డేట్‌కి వెళ్తానని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆయనతోపాటు మరో స్టార్ హీరో పేరు కూడా చెప్పి షాకిచ్చింది సుప్రిత.
గత కొద్ది రోజులుగా సురేఖ, సుప్రిత వీరిద్దరు కలిసి ఓ యూబ్యూట్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. యూట్యూబర్ నిఖిల్ దీనికి యాంకర్‌గా ఉన్నారు. అందులో భాగంగా తమ వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ గురించి చాలా విషయాలను వెల్లడించారు. అందులో భాగంగా వీరి ఇంటర్వ్యూకి సంబంధించిన ఓ షార్ట్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అందులో పవన్ కళ్యాణ్ తో సురేఖ వాణి డేటింగ్ అనే విషయం చక్కర్లు కొడుతుంది. ఇందులో యాంకర్ నిఖిల్.. `అమ్మ(సురేఖ వాణి) డేట్‌కి వెళ్లాల్సి వస్తే, ఏ హీరోతో వెళ్తుంది? అని ప్రశ్నించగా దానికి వెంటనే స్పందించిన కూతురు సుప్రిత ఏ మాత్రం ఆలోచింకచకుండా `పవన్ కళ్యాణ్ తో` అని చెప్పింది.
ఆయనంటే ఎంతో ఇష్టమని పేర్కొంది. ఆయననే కాదు, నాగార్జునతోనూ డేట్‌కి వెళ్లేందుకు అమ్మకి ఇష్టమే అని పేర్కొంది సుప్రిత. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. పవన్‌తో `పంజా` సినిమా చేసిన సురేఖా వాణి నాగార్జునతో `సోగ్గాడే చిన్ని నాయనా`, `కింగ్` చిత్రాలు చేసింది. మరో సందర్భంలో వంద ముద్దులు పెట్టాల్సి వస్తే ఎవరికి పెడతారనే ప్రశ్నకి కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది సురేఖ వాణి. కూతురు సుప్రితకి కాబోయే వాడికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటూ యాంకర్ ప్రశ్నించగా, నన్ను భరిస్తే చాలు అని చెప్పింది సురేఖ వాణి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…