Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

Super Star Krishna Death : టాలీవుడ్ కౌబోయ్, తెలుగు తెర ‘అల్లూరి’, సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ నవంబ‌ర్ 15 తెల్లవారు జామున 4.09 నిల‌కు తుది శ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన కృష్ణను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన కాంటినెంటల్ హాస్పిటల్‌కి తరలించ‌గా, అక్క‌డ ఐసీయూలోలో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్సను అందించారు… అయితే కృష్ణ పరిస్థితి సీరియస్‌గానే ఉందని వైద్య‌లు ముందు నుండి చెబుతూనే ఉన్నారు. వాళ్లు అలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే కృష్ణ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మంగళవారం ఉదయం 4.09 నిల‌కు ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. వయో భారం వల్ల సమస్యలే తప్ప.. ఆయనకు ఆరోగ్యపరమైన ఇతర ఇబ్బందులేమీ లేవు.

ఈ మధ్య కాలంలో వరుసగా.. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముగ్గురు కుటుంబ సభ్యులు విజయ నిర్మల , పెద్ద కుమారుడు రమేష్ బాబు , ఆ తర్వాత మొదటి భార్య ఇందిరా దేవి , అదే సమయంలో తన ఆప్తమిత్రుడైన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇలా వ‌రుస‌గా తనని విడిచి వెళ్లిపోవడంతో కృష్ణ‌ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ పరిణామాలు కృష్ణను మానసికంగా కృంగదీయడంతో.. ఆ ప్రభావం ఆయన ఆరోగ్యంపై కూడా పడింది. ఈ క్ర‌మంలో కృష్ణ స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నారు.

Super Star Krishna Death he died in hospital with cardiac arrest
Super Star Krishna Death

కృష్ణ మృతిపై వైద్యులు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. కార్డియాక్‌ అరెస్ట్‌తో సోమవారం ఉదయం కృష్ణ‌ కాంటినెంటల్‌ ఆసుపత్రికి వచ్చారని డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించామ‌ని అన్నారు. ఇక ఆసుప‌త్రికి వచ్చినప్పటి నుంచి కృష్ణ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని, వచ్చిన కొద్ది గంటల్లో మల్టిపుల్‌ ఆర్గాన్స్‌ ఫెయిల్ అవ్వ‌డం జ‌రిగింది. అప్పటికీ ఆయనకు చికిత్స ప్రారంభించాం. సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్‌ అవసరమైంది . సాయంత్రం 7 గంటలకు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించ‌డంతో పాటు, చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదు.దీంతో చివరి క్షణాల్లో ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా, నొప్పి లేకుండా చూడాలని వైద్యులు కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చించి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారని గురు ఎన్‌ రెడ్డి పేర్కొన్నారు.

1943, మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో ఘట్టమనేని శివరామకృష్ణ జన్మించారు. 1960లో ‘చేసిన పాపం కాశీకెళ్ళినా’ అనే నాటకంతో కృష్ణ నటుడిగా తొలిసారిగా స్టేజ్ ఎక్కారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన తేనే మ‌న‌సులు సినిమ‌తో ఆయ‌న న‌టుడిగా త‌న ప్ర‌స్థానం మొద‌లు పెట్టారు. 1968 నుంచి 74 వరకు ఒక్కో ఏడాది దాదాపు పదికిపైగా కృష్ణ చిత్రాలు విడుదల అయ్యాయి. ఆ టైమ్‌లో తెనాలిలో ఉన్న ఏడు థియేటర్లలో అన్నీ కృష్ణ సినిమాలే ఆడేవంటే ఆయ‌న హ‌వా ఏ విధంగా సాగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. 350 పైగా చిత్రాల్లో న‌టించిన కృష్ణ త‌న కెరీర్‌లో ఎన్నో సాంఘిక, జానపద, పౌరాణిక,జేమ్స్‌బాండ్, కౌబాయ్ వంటి డిఫరెంట్ చిత్రాల్లో న‌టించి మెప్పించారు. కృష్ణ మృతికి సంతాపంగా ఎల్లుండి సినిమా షూటింగ్‌ల‌కి సెల‌వు ప్ర‌క‌టించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago