Sudigali Sudheer : జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న కమెడీయన్ సుడిగాలి సుధీర్. ప్రస్తుతం మనోడు బుల్లితెరపై సందడి చేస్తూనే వెండితెరపై కూడా అలరిస్తున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సుధీర్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలిశ్య కథానాయికగా నటిస్తోంది.
రీసెంట్‌గా చిత్రం నుండి కలయా నిజమా అనే మెలోడి సాంగ్ విడుదల చేశారు. ఇది శ్రోతలని ఎంతగానో ఆకట్టుకుంటుంది. సాంగ్ లాంచింగ్ లో హీరోయిన్ మాట్లాడుతూ.. సహస్ర అంటే ఏమిటీ, దాని గురించి చెప్పాలా అని సుధీర్ తో జోక్ చేస్తుంది. దానికి సుధీర్ తెగ నవ్వేస్తాడు. సినిమా చాలా బాగుంటుంది. మూవీ ప్రతి ఒక్కరిని ఎంతగానో అలరిస్తుందని హీరోయిన్ పేర్కొంది. సుధీర్ మాట్లాడుతూ.. మా టీమ్ తరపున సాంగ్ లాంచ్ చేసిన మీడియా ఫ్యామిలీకి థాంక్స్. మోహిత్, లక్ష్మీ ప్రియాంకగారికి థాంక్స్. చిత్రమ్మగారి ఆశీస్సులు మాకెప్పుడూ ఉంటాయి. సన్నీ బ్యూటీఫుల్ విజువల్స్ అందించారు. మా నిర్మాతలు విజేష్, వెంకట్, చిరంజీవిగారికి థాంక్స్.
మూడేళ్ల కష్టంఈ సినిమా. చాలా స్ట్రగుల్స్ దాటి ఈ స్టేజ్‌కి చేరుకున్నాం. మా డైరెక్టర్ అరుణ్‌గారు కథ చెప్పే సమయంలో బ్లూటూత్ స్పీకర్‌తో మ్యూజిక్ ప్లే చేస్తూ కథను చెబుతూ వచ్చారు. అంత రేంజ్‌లో మూడ్ క్రియేట్ చేస్తూ ఇన్‌టెన్స్‌తో సినిమా చేశారు. శివ బాలాజీగారు అందించిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హీరోయిన్ డాలిశ్యగారు వండర్‌ఫుల్ నటి. టీమ్ అందరం ఫ్యామిలీలా కలిసిపోయి యాక్ట్ చేశాం. సినిమా ఫైనల్ స్టేజ్‌లో గ్యారీ గారు సపోర్ట్ చేయటానికి వచ్చారు. ఆయనకు స్పెషల్ థాంక్స్ అని చెప్పాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుందని సుధీర్ అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…