Charith Manas : హీరో సుధీర్ బాబు గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. “ప్రేమకథ చిత్రం” సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తర్వాత పలు సినిమాలలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఇక సుధీర్ బాబుకి వివాహం జరిగింది అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు. తనకి చాలా క్రితమే వివాహం జరిగి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. అయితే సుధీర్ బాబు… మహేష్ బాబు చెల్లెలు అయినటువంటి ప్రియదర్శినినీ వివాహం చేసుకున్నాడు. అయితే సుధీర్ పెద్ద కొడుకు చరిత్ మానస్ సినిమా కెరీర్ మీద హీరో సుధీర్ బాబు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు.
ఇప్పటికే పలు సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన చరిత్.. ప్రస్తుతం హీరోగా లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాడు. కొడుక్కి అన్ని రకాల శిక్షణలు ఇప్పిస్తున్నారు సుధీర్ బాబు. ఇప్పటికే చరిత్ చేసిన కొన్ని విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇవి చూసిన చాలా మంది ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో రెడీ అని కామెంట్లు పెట్టారు. మరోవైపు, మేనమామ మహేష్ బాబు పోలికలు స్పష్టంగా కనిపిస్తుండడం ఈ కుర్రాడికి ఉన్న మరో ప్లస్. నవ్వు, నడక, ఆహార్యం.. అన్నింటిలోనూ మేనమామను పోలేశాడు చరిత్.తాజాగా చరిత్ చేస్తున్న కొన్ని స్టంట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. అచ్చం మేనమామ మాదిరే చేస్తున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు.
చరిత్ సినిమా హీరోగా పరిచయం అవ్వనున్నట్టు ఇప్పటికే సుధీర్ బాబు స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ‘మామా మశ్చీంద్ర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొడుకు ఆరంగేట్రం గురించి మరోసారి మాట్లాడారు. ‘మామా మశ్చీంద్ర’ సినిమాలో చరిత్ కూడా నటించాడు. దీంతో అతడి ప్రస్తావన తీసుకొచ్చిన సుధీర్ బాబు.. ‘ట్రైలర్లో ఫస్ట్ వచ్చిన ఒకడు, వాడు మా అబ్బాయి. వాడికి థాంక్స్ చెప్తే బాగోదు. ఎక్కడికెళ్లినా ఇంటర్వ్యూల్లో చరిత్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. మూడు సంవత్సరాల్లో వస్తాడు. ఒక తుఫాన్ వస్తుంది.. రెడీ అయిపోండి మీరందరూ. సాలిడ్‌గా కష్టపడుతున్నాడు. ఇదేలెక్క మూడు సంవత్సరాలు కష్టపడితే ఇక ఎవ్వడూ దగ్గర్లోకి కూడా రాడు. అందరికీ దిమ్మ తిరిగిపోతుంది కచ్చితంగా అని చెప్పుకొచ్చారు.