Nagababu : మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు మాత్రమే సినిమాలలో కనిపిస్తున్నారు. అయితే నాగబాబు రీసెంట్‌గా తన కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి ఘనంగా నిర్వహించాడు. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలోని టస్కానీలో నవంబర్ 1వ తేదీన ఘనంగా జరిగింది. పెళ్లి బంధంతో ఈ ప్రేమ జంట ఒక్కటైంది. మెగా, అల్లు కుటుంబాలు, సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుకలు గ్రాండ్‍గా జరిగాయి. వివాహ సంబరాల తర్వాత నూతన దంపతులు వరుణ్, లావణ్య నవంబర్ 4 హైదరాబాద్‍కు చేరుకున్నారు.
విమానాశ్రయానికి వచ్చాక కొందరు అభిమానులు వీరికి స్వాగతం పలికారు. వారిపై పూలు జల్లారు. వరుణ్, లావణ్య హైదరాబాద్‍కు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి పెళ్లి సంబంధించిన ఫొటోలు, వీడియోలు క్రమంగా బయటికి వస్తున్నాయి. ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్‍గా మారుతున్నాయి. ఇక ఆదివారం నాడు హైదరాబాద్ లో వరుణ్ లావణ్య రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు.వరుణ్ లావణ్య రిసెప్షన్ కి రెండు ఫ్యామిలీలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు, పలువురు మెగా అభిమాన సంఘాల నాయకులు హాజరయ్యారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియచేశారు. వరుణ్ – లావణ్య వెడ్డింగ్ రెసెప్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే రిసెప్షన్‌కి సూట్ వేసుకొని వచ్చిన నాగబాబు నడవడంలో చాలా ఇబ్బంది పడుతున్నాడు. వ్యక్తి సాయంతో మాత్రమే నడుస్తున్నాడు. నాగబాబు పరిస్థితి చూసి చలించిపోతున్నారు. అసలు నాగబాబుకి ఏమైంది అని ఆందోళనలో ఉన్నారు. నాగబాబు కన్నా పెద్ద వాడు అయిన చిరు అంత యాక్టివ్‌గా ఉండగా, ఆయనకి ఏమైందని అనుకుంటున్నారు. ఇక వరుణ్ లావణ్య వేడుకకు నాగబాబు కుటుంబీకులతో పాటు బంధువులు హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి దర్శకులు, నటీనటులు, కమెడియన్లు, ఇతర టెక్నిషీయన్లు కూడా హాజరై ఫొటోలకు ఫోజులిచ్చారు. నటి ప్రగతి బ్యూటీఫుల్ శారీలో వేడుకలో మెరిసింది. న్యూలీ మ్యారీడ్ కంపుల్ కు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఫొటోకు ఇలా ఫోజిచ్చింది.