Varun Tej And Lavanya Tripathi : గత కొద్ది రోజులుగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పేర్లు నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ స్టార్ కపుల్స్ లిస్టులో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జోడీ నవంబర్1న పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి వేడుకకి ఇండియా నుంచి సుమారు 120 మంది వరకు వెళ్లారు. అందులో మెగా కుటుంబంలో సభ్యుల సంఖ్య 50 వరకు ఉందని తెలిసింది. నితిన్, నీరజా కోన వంటి స్నేహితులు కొందరు, లావణ్యా త్రిపాఠి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటలీలో జరిగిన వివాహానికి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రులను మాత్రమే ఆహ్వానించడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలో సన్నిహితులని ఈ రోజు రిసెప్షన్‌కి ఆహ్వానించనుంది.
అయితే వరుణ్, లావణ్య జంట నిన్న ఇటలీ నుండి ఇండియాకి వచ్చారు. కొత్త జంటని చూసి మీడియా తెగ క్లిక్‌మనిపించింది. వారిద్దరిని అలా చూసి అభిమానులు తెగ మురిసిపోయారు. చూడముచ్చటైన జంటగా వారిద్దరిని అభివర్ణిస్తున్నారు. ఇక ‘అందాల రాక్షసి’తో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఉత్తరాది భామ, సొట్టబుగ్గల సుందరి మెగా ఇంటి కోడలు అయ్యింది. పెళ్లిలో లావణ్య కాంచీపురం శారీ కట్టుకున్నారు. అయితే… ఆ చీరకు ఓ ప్రత్యేకత ఉంది. దానిపై స్పెషల్ ఎంబ్రాయిడరీ చేయించారు.
వరుణ్ తేజ్ ను మెగా ఫ్యామిలీ, ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగా ‘వరుణ్’ అని పిలుస్తారు. మరి, లావణ్యా త్రిపాఠి ని ‘లావ్’ అని అంటుంటారు. రెండు ముద్దు పేర్లను కలిపి శారీ మీద తెలుగులో రాయించుకుని వాటి పక్కన ఇన్ఫినిటీ సింబల్ పెట్టారు లావణ్య త్రిపాఠి. ‘వరుణ్ లావ్ ఇన్ఫినిటీ అని రాసి ఉంది. తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అంతులేనిది అని, తామిద్దరం కలకాలం ఒక్కటిగా ఉండాలని పరోక్షంగా లావణ్యా త్రిపాఠి ఈ విధంగా రాసుకొచ్చింది!? అన్నట్టు… సోషల్ మీడియాలోనూ వరుణ్ లావ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇక లావణ్య త్రిపాఠి ఎప్పుడో తెలుగు అమ్మాయి అయిపోయారు. తెలుగు సినిమాలు చేయడమే కాదు… హైదరాబాద్ లో చాలా రోజుల క్రితమే సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు.