SS Rajamouli : ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అనేక మంది తమ స్పందన తెలియజేయగా, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే బాలయ్య అరెస్ట్ తర్వాత.. ఏపీలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు…తెలంగాణ పార్టీ నేతలతో సమీక్షలతో బాలయ్య బిజీ అయ్యారు. అటు పవన్ తో పొత్తు…మద్దతు విషయంలోనూ బాలయ్య పార్టీ కేడర్ కు సూచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీని పైన భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ వారాహి యాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు బాలయ్య, లోకేశ్ సూచిస్తున్నారు. పవన్ సైతం టీడీపీతో కలిసి పని చేయాలని తన కేడర్ ను కోరుతున్నారు.
ఇదే సమయంలో బాలయ్య పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారారు. ఏపీ, తెలంగాణ నేతలతో పార్టీ కార్యక్రమాల పైన సమీక్షలు చేస్తున్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ పైన పార్టీ నేతలతో బాలయ్య సమావేశమయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్ పైన స్పందించకపోవటం పైన బాలయ్య డోన్ట్ కేర్ అంటూ చేసిన కామెంట్ సంచలనంగా మారింది. ఇదే సమయంలో మరో ఆసక్తి కర చర్చ సాగుతోంది. టీడీపీకి జూనియర్ కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. మొత్తంగా రాజకీయాల వైపు చూడకుండా పూర్తిగా సినిమాలకే పరిమితం అయ్యారు. గతంలో అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు.ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు సమయంలో తారక్ స్పందించినా..టీడీపీ నేతల ప్రతిస్పందనతో వివాదంగా మారింది.
జూనియర్ స్పందించకపోవడంపై ఇప్పటి వరకు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. పలువురు టీడీపీ నేతలు దీనిపై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడాన్ని తప్పు పట్టారు. తాజాగా దానిపై స్పందించిన రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంపై స్పందించారు. అనవసరంగా ఎన్టీఆర్‌ని రాజకీయాలలోకి లాగొద్దని అన్నారు. ప్రస్తుతం అనవసరంగా ఆయనని రాజకీయాలలోకి లాగొద్దని అనవసరంగా ఎన్టీఆర్‌ని రాజకీయాలలోకి లాగొద్దంటూ రాజమౌళి కామెంట్ చేశారు. ప్రస్తుతం అతని వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.