SS Rajamouli : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన రాజమౌళి ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో భారీ విజయాన్ని అందిపుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవల జపాన్‌లోను విడుదలై మంచి విజయం సాధించింది. ఇక త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు జక్కన్న. ఈ సినిమాకి సంబంధించి అనేక ప్రచారాలు నడుస్తున్నాయి. ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి అభిమానులు సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక రాజమౌళి హాలీవుడ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ మహేష్ సినిమా గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ హింట్స్ ఇస్తుంటే అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు.
ఇప్పటికే మహేష్ తో తీయబోయే సినిమా గ్లోబల్ అడ్వెంచర్ అని, విదేశాల్లో, అడవుల్లో జరిగే కథ అని, ఇండియానా జోన్స్ లాగా సాహసయాత్ర సినిమా అంటూ పలు వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. ఈ సినిమాకి విజయేంద్రప్రసాద్ కథ రాస్తున్నారు. తాజాగా విజయేంద్రప్రసాద్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మహేష్ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమాపై మాట్లాడుతూ.. ”మహేష్ బాబు మంచి ఇంటెన్సిటీ ఉన్న యాక్టర్. యాక్షన్ సన్నివేశాల్లో ఎంతో అద్భుతంగా నటిస్తాడు. రాజమౌళి ఎప్పట్నుంచో ఇలా అడవుల్లో సాగే సాహసయాత్ర లాంటి కథని తీయాలని అనుకున్నాడు.
ఈ కథకి మహేష్ సరిగ్గా సరిపోతాడు. అందుకే రాజమౌళి మహేష్ తో సినిమా తీయడానికి ఫిక్స్ అయ్యాడు. నేను మహేష్ ని దృష్టిలో పెట్టుకొని చక్కని కథ రాస్తున్నాను. ఈ సినిమా షూటింగ్ 2023 మే లేదా జూన్ నుంచి మొదలు అవుతుంది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ సినిమాని షూట్ చేయబోతున్నాం అంటూ విజయేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ శరవేగంగా జరుగుతుండగా, మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని అంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…