Gummadi : గుమ్మడి.. ఈ పేరు ఈ కాలం నాటి వారికి పెద్దగా తెలిపోవచ్చు కాని అప్పటి కాలం వారికి మాత్రం చాలా సుపరిచితం. విలక్షణమైన పాత్రలు పోషిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు గుమ్మడి. అతి చిన్న వయసులో ఎంతో భారమైన, పరిణితి కి మించిన పాత్రలు ధరించి ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు.గుమ్మడి నటన జీవితానికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణలు గురించి చెప్పాలంటే ఆయన నటించిన అర్ధాంగి సినిమాలో గుమ్మడి కి భార్యగా నటించిన నటీమణి శాంతకుమారి కాగా, ఆమె ఆయన కన్నా ఎనిమిది సంవత్సరాలు పెద్ద వయసు కలిగింది .ఇక గుమ్మడి కి పెద్ద కొడుకు గా నటించిన అక్కినేని నాగేశ్వరరావు ఆయన కన్నా మూడు సంవత్సరాలు పెద్దవాడు.
గుమ్మడి కి చిన్న కొడుకుగా నటించిన జగ్గయ్య వయసు కూడా గుమ్మడి కంటే సంవత్సరం పెద్ద. ఇలా తనకంటే పెద్ద హీరోలకు తండ్రిగా, అన్నగా నటించి పెద్ద పాత్రలకు పెట్టింది పేరుగా గుమ్మడి నటనా జీవితం కొనసాగించారు. అయితే గుమ్మడి కి సీనియర్ ఎన్టీఆర్ కి మధ్యలో కొన్నేళ్లపాటు కోల్డ్ వార్ జరిగింది. వాస్తవానికి గుమ్మడి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటుడు నాగయ్య ఆఫీస్ లోనే ఒక రూమ్ లో ఉండేవాడు.మొదటి రెండు సినిమాల వరకు కూడా అక్కడే ఆశ్రయం పొందాడు. తర్వాత ఏమైందో ఏమో కాని తన మకాంని హోటల్ రూంకి మార్చాడు.
ఆ సమయంలో టి.ఎన్.టి వారి ఆఫీస్ ఎదురుగా సంగీత దర్శకుడు టీవీ రాజు ఒక హోటల్లో ఎన్టీ రామారావు తో కలిసి ఉండేవారు.అక్కడ గుమ్మడి తో ఎన్టీఆర్ కి జరిగిన పరిచయం, చివరికి తన సొంత చిత్రంలో గుమ్మడి కి పిలిచి మరి అవకాశం ఇచ్చే స్థాయి వరకు వెళ్లింది . అనేక సినిమాల్లో గుమ్మడి ఎన్టీఆర్ కలిసి నటించారు. ఆ తర్వాత కాలంలో అక్కినేని కి ఎన్టీఆర్ కి పొసగకపోవడం వారి మధ్య వివాదాలకు తావిచ్చింది. అక్కినేని సినిమాల్లో ఎక్కువగా గుమ్మడి నటిచండంతో ఎన్టీఆర్ ఆయనని దూరం పెట్టాడట. ఓ సారి గుమ్మడి ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి తన కుమార్తె పెళ్లికి రావలసిందిగా కోరినా కూడా ఎన్టీఆర్ రాలేదు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు గుమ్మడి.ఆ తర్వాత కాలంలో అక్కినేని ఎన్టీఆర్ కలిసిపోవడంతో గుమ్మడికి కూడా తన సినిమాలలో అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…