Sr NTR : సీనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న విషయం తెలిసిందే. ఒకే జానర్‌లో కాకుండా వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ డిఫరెంట్ సినిమాలు చేశారు. ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో ఉన్నతమైన నైతిక విలువలు కలిగిన వ్యక్తి చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టి పేదవారికి అండగా నిలిచారు. ఇక భారతీయ సంస్కృతి, దైవ సిద్ధాంతాల పైన మంచి పరిజ్ఞానం ఉన్న ఎన్టీఆర్ ఒకానొక సమయంలో క్షుద్ర పూజలు చేస్తారంటూ, స్మశానంలో పూజలు చేయడం, రాత్రి పూట చీర కట్టుకుని స్మశానం లోనే పడుకునే వారంటూ అప్పట్లో తెగ ప్రచారం నడిచింది.
ఈ విషయంపై ప్రముఖ జర్నలిస్టు భరద్వాజ స్పందిస్తూ అప్పట్లో ఎన్టీఆర్ పై వచ్చిన ఈ వార్తలో అస్సలు నిజం లేదు కేవలం ఆరోపణలు మాత్రమే. ఆయన పేరును పాడు చేయడానికి ఆనాటి ప్రతిపక్షాలు చేసిన కుట్ర అనే చెప్పాలి.. నిజమైన ఎన్టీఆర్ ఆలోచనలు ఇప్పటికీ చాలా మందికి తెలియవు అంటూ తన మనసులోని మాటని మీడియా ముందు వ్యక్తపరిచారు.నిజమైన ఎన్టీఆర్ ఆలోచనలు తెలియాలంటే కుర్థళం పీఠాధిపతి ప్రసాదరాయ కులపతి ప్రస్తుతం మౌనస్వామి అని పిలిచే ఆయన ఒకసారి ఎన్టీఆర్ గారు ఇచ్చిన ప్రసంగం గురించి చెప్పి కొత్త ఎన్టీఆర్ ను లోకానికి పరిచయం చేసారు అంటూ భరద్వాజ గారు వివరించారు.
ఎన్టీఆర్ గారిపై త్రిపురనేని రామస్వామి గారి సిద్ధాంతాల ప్రభావం సినిమాల్లోనూ అలానే తన పాలనలో తీసుకొచ్చిన సంస్కరణలో స్పష్టంగా కనిపిస్తుంది.ఎన్టీఆర్ గారిలో కొంత ద్రావిడ సిద్ధాంతపు ఆలోచనలు కూడా ఎక్కువ, ఆయనను ఆ వైపుగా ప్రభావితం చేసిన వ్యక్తి త్రిపురనేని రామస్వామి గారు అని చెప్పాలి.. ఎన్టీఆర్ గారు ఓ సందర్భంలో బ్రాహ్మణ అంటే కులం కాదు, బ్రహ్మ జ్ఞానం తెలిసిన శూధ్రుడైనా బ్రాహ్మణుడే అంటూ శంకర పద్యం ను ఉదాహరించి దాదాపు రెండు గంటల పాటు భారతీయ సంస్కృతి వేదాల గురించి మాట్లాడం అందరిని ఆశ్చర్యపరిచింది.. ఎన్టీఆర్ గారు మూఢనమ్మకాలను అస్సలు నమ్మేవారు కాదు. దైవత్వం అంటే మాత్రం అపారమైన నమ్మకం ఉండేది అంటూ భరద్వాజ ఎన్టీఆర్ గొప్పతనాన్ని గురించి చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…