Srikanth Iyengar : ఏపీ బీర్ తాగుతున్నా.. నాకు ఏదైన అయితే.. అంటూ సెటైర్స్ వేసిన టాలీవుడ్ నటుడు..

Srikanth Iyengar : ఏపీలో లభించే మద్యంపై ఇప్పటికే అనేక అపోహలు ప్రచారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసిపి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మ‌ద్య‌పాన నిషేదం అమ‌లు చేస్తాన‌ని చెప్పి.. ప్ర‌మాదకరమైన మద్యం బ్రాండ్స్ అమ్మకాలకు అనుమతి ఇచ్చారంటూ ప‌లువురు ఆరోపిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తన స్వలాభం కోసం జగన్ ప్రజల ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నాడని మండిపడుతున్నారు. మార్కెట్ లో బాగా సేల్ అయ్యే మద్యం బ్రాండ్స్ కాకుండా ఏపీలో కొత్త కొత్త పేర్లతో అమ్ముతుండటం పై ప‌లువురు సెటైర్స్ పేలుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌ముఖ‌ సినీనటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఏపీ మద్యంపై సెటైరికల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

శ్రీకాంత్ అయ్యంగార్ తన వీడియోలో.. ఈరోజు బెజవాడలో ఉన్నా.. డిప్రెషన్లో ఉండి బీరు తెచ్చుకున్నా. ఇది మామూలు బీరు కాదు.. ఇంట్లో కూడా చెప్పలేదు.. తాగితే ఏమవుతుందో తెలీదు.. నన్ను గుర్తుపెట్టుకోండి’ అంటూ నటుడు శ్రీకాంత్ అయ్యర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో శ్రీకాంత్ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో నటుడు శ్రీకాంత్ అయ్యర్ బూమ్ బూమ్ బీర్‌ను చూపిస్తూ ఎద్దేవా చేశారు. కొద్ది రోజుల క్రితం కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మరణించ‌గా, ఆయ‌న మ‌ర‌ణానికి ఈ బీర్ కారణమంటూ ఆరోపణలు చేశారు టీడీపీ నేతలు. అయితే ఆయన రక్త విరేచనాలతో ఆసుపత్రిలో చేరి ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. అలాగే రాకేష్ మాస్టర్ బూమ్, బూమ్ బీర్ తాగిన వీడియోలను కూడా వైరల్ చేశారు. మళ్లీ ఇప్పుడు శ్రీకాంత్ అయ్యర్ బూమ్ బూమ్ బీరు తీసుకొచ్చి సెటైర్లు పేల్చడం హాట్ టాపిక్ అయ్యింది.

Srikanth Iyengar comedy while drinking beer
Srikanth Iyengar

ఓ చేతితో సిగరెట్, మరో చేతిలో బూమ్ బూమ్ బీర్ బాటిల్ ను చూపిస్తూ యాక్టర్ శ్రీకాంత్ ఇప్పుడు సెటైర్లు వేసారు. మద్యపానం, దూమపానం ఆరోగ్యానికి హానికరం అంటూనే… ఏపీ మద్యం ఇంకెంతో హానికరం అనేలా శ్రీకాంత్ కామెంట్స్ చేసారు. ఆయన సరదాగానే వీడియో చేసినా దీన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా వాడుకునే జగన్ సర్కార్ ను విమర్శించే అవకాశం వుంది. శ్రీకాంత్ అయ్యంగార్ .. వ‌ర్మ సినిమాల‌లో ఎక్కువ‌గా కనిపిస్తుంటారు.

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

1 month ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

1 month ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

5 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

5 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

5 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

5 months ago