Sridevi Shoban Babu Movie : యంగ్ హీరో సంతోష్ శోభన్ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. మారుతి, మేర్లపాక గాంధి వంటి సక్సెస్ ఫుల్ దర్శకులతో సినిమాలు చేసిన ఫలితం లేకుండా పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న శ్రీదేవి శోభన్ బాబు సినిమా కూడా సంతోష్‌ను గట్టెక్కించలేకపోయింది. మెగాడాటర్ సుస్మిత ప్రొడక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పెద్ద సక్సెస్ లేదు. ఈ సినిమాకు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. సాంగ్స్, టీజర్లు, ట్రైలర్లతో పాటు టైటిల్ క్యాచీగా ఉండడంతో రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి.
ఫీల్‌గుడ్ సినిమా కావడంతో యువతను ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే శ్రీదేవి డిజిటల్ రిలీజ్ కోసం ఓటీటీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అధికారిక ప్రకటన అయితే వచ్చింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ దక్కించుకోగా, మార్చి 30 నుంచి సినిమాను స్ట్రీమింగ్ కానుంది. ఇదే విషయాన్ని సదరు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా వెల్లడించింది.ప్రశాంత్ దిమ్మెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంతోష్‌కు జోడీగా తమిళ నటి గౌరీ కిషన్ హీరోయిన్‌గా నటించింది.
శ్రీదేవి శోభన్ బాబు సినిమాలో బావామరదళ్లుగా సంతోష్ శోభన్, గౌరి.జి కిషన్ కనిపించారు. కుటుంబాల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఎప్పుడూ గొడవలు పడే శోభన్‌బాబు, శ్రీదేవి ఎలా ప్రేమలో పడ్డారు?తమ కుటుంబాలను ఏ విధంగా కలిపారన్నదే సినిమా కథ. ఈ సినిమాలో నాగబాబు, రోహిణీ కీలక పాత్రలు పోషించారు. కమ్రాన్ స్వరాలు సమకూర్చారు. అయితే భారీ అంచనాలతో వచ్చిన శ్రీదేవి శోభన్ బాబు సినిమా రిలీజయ్యాక డివైడ్ టాక్ తెచ్చుకుని డిజాస్టర్ కలెక్షన్‌లను రాబట్టింది.మరి థియేటర్‌లో పెద్దగా అలరించలేకపోయిన ఈ చిత్రం ఓటీటీలో అయిన సందడి చేస్తుందా లేదా అనేది చూడాలి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…