Iratta Movie : ఇటీవల ఓటీటీ చిత్రాలకి మంచి డిమాండ్ ఏర్పడింది. వైవిధ్యమైన కథలతో పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, అవి ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇతర భాషలలో రిలీజైన ఈ చిత్రాలు డబ్ చేసుకొని ఆయా ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతున్నాయి. ఇప్పుడు ఓటిటిలో బ్లాక్ బస్టర్ అయిన మలయాళ సినిమాని మిగతా భాషల్లోకి కూడా అనువదించే ప్రయత్నాలు చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఇరాట్ట’ మూవీ గురించి చాలా మంది విని ఉంటారు. ఈ చిత్రం మార్చి 3న ఓటీటీలో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించింది.
ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో కూడా విడుదలైతే బాగుంటుందని, అందుకే ఈ సినిమాని తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలని రిక్వెస్టులు వినిపించాయి. ఈ క్రమంలోనే ఇరాట్ట మూవీని తెలుగులో డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమాలో జోజూ జార్జ్, అంజలి, మనోజ్ కె.యు ఆర్యన్ సలీమ్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాని దర్శకుడు రోహిత్ ఎంజి కృష్ణన్ తెరకెక్కించారు.
థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఇరాట్ట మూవీ కథ.. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. మరి ఇన్ని రోజులు తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్.. త్వరలో తెలుగు వర్షెన్‌లో ఈ సినిమా చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చ. అయితే ఇటీవలి కాలంలో థ్రిల్లర్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే మేకర్స్ కూడా ఎన్నో థ్రిల్లర్ చిత్రాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మలయాళంలో ఇలాంటి చిత్రాలు ఎక్కువగా వస్తుండగా, వాటికి ఆదరణ లభిస్తుండడంతో ఈ చిత్రాలు ఇతర భాషలలో కూడా డబ్బింగ్ జరుపుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…