RRR : తెలుగు సినిమాకి అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్ ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్కింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ కల సాకారం అయింది. ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటను ఆస్కార్ వరించింది. ఎమ్.ఎమ్ కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్నారు. ఖండాంతరాలకు వ్యాపించిన తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. నాటు నాటు తో పాటు టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హ్యాండ్ (టాప్‌గన్:మావెరిక్), లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), దిస్ ఈజ్ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) పాటలు ఆస్కార్‌కు పోటీ పడగా.. నాటు నాటు పాట ఆస్కార్ గెలిచి చరిత్ర సృష్టించింది.
ఇప్పుడు నాటు నాటు పాటకి ఆస్కార్ దక్కడంతో ప్రతి ఒక్క తెలుగు అభిమానితో పాటు ఇండియన్ సినిమా ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం తమ ఈర్ష్యని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్.. రాజమౌళి సినిమాని తెగ మెచ్చుకుంటుంటే ఏమి తెలియని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్రెండ్ అయిన షాన్ మట్టతిన్ ఆశ్చర్యకరమైన పోస్ట్ పెట్టి నెటిజన్స్‌తో చీవాట్లు తింటున్నాడు.
‘హాహాహా ఇది చాలా ఫన్నీ. ఇప్పటివరకు ఇండియాలో మాత్రమే అవార్డ్స్ కొనుక్కోవచ్చని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆస్కార్స్ లో కూడా అలానే జరుగుతుందా. డబ్బులుంటే ఆస్కార్ కూడా కొనేయొచ్చు అంటూ షాన్ కామెంట్ చేశాడు. దీనిపై రెచ్చిపోతున్న నెటిజన్స్.. ఏకిపారేస్తున్నారు. బాలీవుడ్ లో మాత్రమే అవార్డ్స్ డబ్బులిచ్చి కొంటారని ఫైర్ అవుతున్నారు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆస్కార్ పురస్కారం తాలూకు ఆనందోత్సాహాల్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్న రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సీక్వెల్‌పై ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. ‘ఆస్కార్ విజయం ఓ దర్శకుడిగా నాపై మరింత బాధ్యతను పెంచింది. సీక్వెల్‌కు సంబంధించిన పనుల్ని మరింత వేగవంతం చేసేలా స్ఫూర్తినిచ్చింది. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే’ అంటూ రాజమౌళి పేర్కొన్నారు. దీంతో సీక్వెల్ తప్పక తీస్తాడేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…