Dhanush : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య, అప్పుడప్పుడే సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న ధనుష్ పెళ్లి అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిన విషయం తెలసిందే. అయితే 18 ఏళ్ల తమ బంధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ విడాకులు తీసుకుంటున్నట్లు ఈ జంట ప్రకటించడం అందరికి షాకింగ్ అనిపించింది. 18 ఏళ్లపాటు ఒకరికొకరం స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి ఉన్నాం. ఈ ప్రయాణంలో ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. కలిసి ఎదిగాం. అయితే ఇప్పుడు ఇద్దరి దారులు వేరయ్యే సమయం వచ్చింది. నేను, ఐశ్వర్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం” అని ధనుష్ ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేశాడు.
ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఇలా విడిపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.వీరిద్దరు కలిస్తే బాగుండు అని అందరు అనుకున్నారు. అయితే డైవర్స్ ని రద్దు చేసుకుని మళ్లీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్టు గత అక్టోబర్‌లో వార్తలొచ్చాయి. రజనీకాంత్ .. ఇద్దరి మధ్య రాజీ కుదుర్చారని, దీంతో అంతా సెట్ అయ్యిందని అన్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం చెన్నైలోని సిటీ సివిల్ కోర్ట్ కి ఈ ఇద్దరు విడాకుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారట. ధనుష్ మరో అమ్మాయి కోసం ఐశ్వర్య రజనీకాంత్ తో విడిపోవాలనుకుంటున్నట్టు తెలుస్తుంది.
అయితే ఈ విషయాన్ని ఒవర్సీస్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేయడం గమనార్హం. ధనుష్ వేరే అమ్మాయి కోసం ఐశ్వర్య ని చీట్ చేశాడని ..ఈ జంట మరోసారి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారని ఆయన ట్విట్ చేశారు . ఈ క్రమంలోనే మరోసారి ధనుష్- ఐశ్వర్య పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. అయితే ఉమైర్ సంధు తన పాపులారిటీ కోసం కొద్ది రోజులుగా ఇలాంటి కాంట్రవర్సియల్ కామెంట్లు చేస్తున్నాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సదరు హీరోహీరోయిన్ల అభిమానులు ఆయన్ని ఏకి పడేస్తున్నారు. బూతులు తిడుతూ ఆయన్ని తిట్టిపోస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…