Bigg Boss : పూల చొక్కాలు వేసుకొని, రంగు వేసుకుంటే స‌రిపోతుందా.. నాగ్‌పై శ్రీరెడ్డి సెటైర్స్..

Bigg Boss : కాస్టింగ్ కౌచ్‌తో హాట్ టాపిక్‌గా మారిన శ్రీరెడ్డి ఇటీవ‌లి కాలంలో యూట్యూబ్ వీడియోల‌తో ఎంత ర‌చ్చ చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మీ టూ మూమెంట్‌, కాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని నడిపించిన తీరుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని పెద్దలు సైతం నోరెళ్ల‌బెట్టారు. శ్రీరెడ్డి దెబ్బతోనే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి.. తమకు జరిగిన అన్యాయాల గురించి చెప్పారు. మ‌రి శ్రీరెడ్డి చేసిన ర‌చ్చ అప్ప‌ట్లో మాములుగా లేదు. సురేష్ బాబు త‌న‌యుడు, నాని, శేఖ‌ర్ క‌మ్ముల ఇలా ప‌లువురు గురించి దారుణంగా మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇక సురేష్ బాబు రెండో కుమారుడు దగ్గుబాటి అభిరామ్ తనను అవకాశాలు ఇప్పిస్తానని దారుణంగా వాడుకుని సర్వస్వం దోచుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేసింది. అభిరామ్ అవసరాలు తీరాక తనను వదిలేశాడని చెప్పడంతో పాటు అభిరామ్ తనతో ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా మీడియాకు విడుదల చేసింది. ఇక తాజాగా అభిరామ్.. తేజ దర్శకత్వంలో తన తొలి సినిమా అహింసతో త్వరలోనే ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాపై త‌న‌దైన శైలిలో సెటైర్స్ వేసింది. అంతేకాదు బిగ్ బాస్ పై కూడా త‌న దైన శైలిలో స్పందించింది.

Sri Reddy sensational comments on Bigg Boss and Nagarjuna
Bigg Boss

బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళతారా ? అని అడిగిన యాంక‌ర్ ప్రశ్నకు స్పందించిన శ్రీరెడ్డి.. చస్తే బిగ్ బాస్ కు వెళ్లను.. అని స్పష్టం చేసింది. బిగ్ బాస్ కు వెళ్లి పరువు తీసుకోవడం తప్ప ఉపయోగం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. నాలుగు రాళ్లు వెనకేసుకొని ఇల్లు కొనుక్కోగలరేమో కానీ.. పరువు, క్యారెక్టర్ పోగొట్టుకొని బయట నిలబడిన ఎంతో మంది ఉన్నారంటూ దారుణ‌మైన కామెంట్స్ చేసింది. ఇక బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్ అని.. నాగార్జున అసలు ఎలా ఒప్పుకొని ఈ షో చేస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొంది. నాగార్జున మీసాలకు, జుట్టుకు రంగు వేసుకొని నాలుగు పూల చొక్కాలు వేసుకొని బిగ్ బాస్ టీమ్ వాళ్లు రాసిచ్చిన ప్రశ్నలు అడిగితే సరిపోతుందా ? అంటూ కాస్త సెటైరిక‌ల్ ప్ర‌శ్న‌లు కూడా సంధించింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago