Naga Chaitanya : అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య స్లో అండ్ స్టడీగా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. చివరిగా చైతూ నటించిన థాంక్‌యూ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే నాగ చైతన్య కెరీర్‌ని మార్చేసిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ సినిమా అసలు ముందుగా మహేష్ దగ్గరకు వెళ్లిందట. ఆయన నో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్ చైతూ దగ్గరకు వెళ్లడం, ఈ సినిమాతో కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం జరిగింది.
ఏ మాయ చేశావే మూవీ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ కథను తొలిసారిగా మహేశ్ బాబుకే వినిపించినట్టు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ముందుగా మంజులకు ఈ కథ గురించి చెప్పాడట. కథ బాగుంది కానీ మహేశ్ చేస్తాడో.. లేదో.. అని గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో మంజుల తెలిపినట్లు సమాచారం. తర్వాత ఈ కథను మహేశ్ బాబుకు చెప్పగా.. చిన్న స్టోరీ కదా.. అని అనేశాడట. మహేశ్ బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆ అంచనాలు వేరే లెవెల్‌లో ఉంటాయని నో చెప్పాడట.
అయితే ఏదైనా యాక్షన్ కథ చేద్దామని మహేశ్ బాబు చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ మూవీని మహేశ్ చేసి ఉంటే పెద్ద సినిమా అయ్యేదని గౌతమ్ మీనన్ తెలిపాడు. ఇక అక్కినేని నాగ చైతన్య, సమంత తొలిసారిగా జోడీ కట్టి, హిట్ కొట్టి, ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రం ఏ మాయ చేశావే. ఈ మూవీ ఎంతపెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ చిత్రాన్ని గౌతమ్ మీనన్ తమిళ్ లో శింబు తో తెరకెక్కించాడు. అక్కడ జెస్సీ పాత్రలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…