Ranga Ranga Vaibhavanga : మెగా హీరో సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది. యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోగా, ఇటీవల రంగరంగ వైభవం చిత్రంతో పలకరించాడు. మొదటి చిత్రంతోనే రికార్డులు క్రియేట్ చేయడంతోపాటు గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో ఏకంగా వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. కానీ రంగరంగ వైభవం చిత్రంతో భారీ ఫ్లాప్‌ను చవి చూశాడు. సెప్టెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఫైనల్‌గా బ్రేక్ ఈవెన్ సాధించలేక వైష్ణవ్ కెరీర్‌లో వరుసగా రెండో ఫెయిల్యూర్‌గా మిగిలింది.
ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ హక్కులను దక్కించుకోగా గత రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులోనూ పెద్దగా ఆదరణ లభించడం లేదని తెలుస్తుంది. ఈ చిత్రంలో వైష్ణవ్‌కు జోడీగా కేతిక శర్మ హీరోయిన్‌గా నటించింది. నవీన్ చంద్ర కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. గిరీశయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీ.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించాడు.
ప్రస్తుతం వైష్ణవ్‌తేజ్ రెండు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో స్పోర్ట్స్ డ్రామా చిత్రాన్ని చేస్తున్నాడు. దీనితో పాటు సితార బ్యానర్‌లో ఓ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇవి రెండు ఫ్లాప్ అయితే వైష్ణవ్ కెరీర్ ఇప్పట్లో గాడిలో పడడం కష్టం. కాగా వైష్ణవ తేజ్ నటించిన కొండ పొలం చిత్రం గతేడాది విడుదలైన విషయం తెలిసిందే. అసలు వచ్చిందన్న విషయమే సగం మందికి తెలియకుండా వెళ్లిపోయింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…