SRH : సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ మధ్య కాలంలో అద్భుతంగా ప్రదర్శన కనబరచ్చిన దాఖలాలే లేవు. కొన్ని సీజన్స్ నుండి చెత్త ప్రదర్శన కనబరుస్తూ అభిమానుల ఉత్సాహాన్ని కూడా నీరు కారుస్తుంది. అయితే ఈ సీజన్ అలా లేదు. రికార్డ్‌లు తిరగరాయాలి అంటే అది సన్‌రైజర్స్ వల్లనే అవుతుంది అనేలా తయారైంది. ఈ సీజన్స్ లో రెండు మూడు సార్లు 250 ప్లస్ స్కోరు కూడా చేశారు. ఇక రీసెంట్‌గా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 167 పరుగుల లక్ష్యాన్ని 62 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో అనేక రికార్డులు సన్‌రైజర్స్ చెరిపేసినట్టైంది. టీ 20 క్రికెట్‌లో 150+ పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో సన్ రైజర్స్ ట్రాక్ వేరు. 2018-19 బీబీఎల్ లో మెల్బోర్న్ స్టార్స్ పై బ్రిస్బేన్ హీట్ ఇదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. 157 రన్ టార్గెట్ ను 60 బంతులు మిగిలి ఉండగానే కొట్టి పడేసింది.
2018లో నార్త్ అంప్టన్ షైర్, వోర్సెస్టర్ షైర్ టీ -20 మ్యాచ్ జరిగింది.. ఇందులో భాగంగా వోర్సెస్టర్ షైర్ .. నార్త్ అంప్టన్ షైర్ విధించిన 162 పరుగుల లక్ష్యాన్ని సులువుగా చేధించింది. ఇప్పటి వరకు అదే రికార్డ్ కాగా దానిని సన్‌రైజర్స్ చెరిపేసింది. లక్నో ఇచ్చిన 167 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే చేధించారు. ఇక ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు పవర్ ప్లే లో 107 రన్స్ కొట్టింది. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ పవర్ ప్లే లో ఏకంగా 125 రన్స్ చేసి టాప్ రికార్డ్ నిలబెట్టింది. ఇక ఈ సీజన్‌లో హైదరాబాద్ 12 మ్యాచ్‌లు ఆడగా, వాటిలో మొత్తం 146 సిక్స్‌లు కొట్టారు. 2018 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కొట్టిన 145 సిక్స్లు కొట్టగా దానిని, సన్‌రైజర్స్ చెరిపేసింది.
హైదరాబాద్ ఓపెనర్ ట్రావిడ్ హెడ్ ఈ ఐపీఎల్లో 20 కంటే తక్కువ బంతుల్లో మూడు అర్థ సెంచరీలు చేశాడు. హెడ్ తర్వాత స్థానంలో జేక్ ఫ్రెజర్ కొనసాగుతున్నాడు. అతడు 20 కంటే తక్కువ బంతుల్లో మూడుసార్లు అర్థ సెంచరీలు చేశాడు. హెడ్ 16 బంతుల్లో రెండు అర్థ సెంచరీలు సాధించగా, ఇది కూడా హైదరాబాద్ జట్టుకి ఒక రికార్డ్.. ఇక లక్నో జట్టు పై హెడ్, అభిషేక్ శర్మ నెలకొల్పిన 167 పరుగుల భాగస్వామ్యం (17.27 రన్ రేట్) ఐపీఎల్ లో అత్యుత్తమం. ఇక 10 వికెట్ల తేడాతో విజయం సాధించడం హైదరాబాద్ జట్టు ఇది రెండవసారి.. 2020లో జరిగిన మ్యాచ్లో ముంబై 150 రన్స్ టార్గెట్ విధించగా.. దానిని వికెట్ కోల్పోకుండా హైదరాబాద్ చేదించింది. టి20 క్రికెట్లో 150 + చేజింగ్ లో పాకిస్తాన్ మాత్రమే రెండుసార్లు పది వికెట్లు తేడాతో విజయాలను అందుకుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…