CM YS Jagan : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారు, కూటమి ఏదైన మ్యాజిక్ చేస్తుందా అని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతూ ప్రచారం చేస్తున్నారు. మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని కసితో ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ఉంటానని, సీఎంగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ధీమా కూడా వ్యక్తం చేశారు.. విశాఖ అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్ కు ధీటుగా విశాఖను అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ అభివృద్ధికి కేంద్రం సహకారం ఉండాలన్నారు.
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య నమూనాతో సమష్టిగా కృషి చేస్తేనే విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్న సీఎం జగన్… శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుందన్నారు. అమరావతి అభివృద్ధికి లక్ష కోట్లు అవసరం అన్నారు. అక్కడ 50 వేల ఎకరాల బీడు భూమి తప్ప ఏంలేదన్నారు.వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చిత్తశుద్దితో ఉన్నామని పేర్కొన్నారు. తన అయిదు సంవత్సరాల కాలంలో విశాఖపట్నంలో చోటు చేసుకున్న అభివృద్ధి ప్రాజెక్టులు, ఇక్కడికి తరలివచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు.
కొందరు స్వార్థ రాజకీయ నాయకులు, ఒక వర్గానికి చెందిన మీడియా వల్ల విశాఖ నగరం వెనుకబడి పోయిందని వ్యాఖ్యానించారు జగన్.విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించినప్పుడు వాళ్లంతా న్యాయస్థానాలకు వెళ్లారని గుర్తు చేశారు. అన్ని రకాలుగా విశాఖపట్నం అభివృద్ధిని అడ్డుకున్నారని చెప్పారు. ఇది- ఒక్క విశాఖ అభివృద్ధిని మాత్రమే అడ్డుకున్నట్లు కాదని, మొత్తం రాష్ట్రాభివృద్దినే అడ్డుకునేలా వ్యవహరించారని జగన్ పేర్కొన్నారు. విశాఖ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. విశాఖ స్టేడియాన్ని మెరుగ్గా నిర్మిస్తున్నామన్నారు.మెగా, భారీ పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈలు కూడా చాలా ముఖ్యమని, వాటి ద్వారా 30 లక్షలమందికి ఉద్యోగాలను ఇవ్వగలిగామని అన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…