RCB In Play Offs : గత 16 సీజన్స్‌గా ఐపీఎల్ ఆడుతున్న ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్ కొట్టింది లేదు. ఈ సారైన కప్ కొడుతుందా అంటే కష్టమేనంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు ఆ జట్టు ప్లేఆఫ్స్‌కి వెళ్లడం కూడా కష్టంగానే ఉంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ అదరగొట్టింది. పంజాబ్ కింగ్స్‌ను 60 పరుగుల తేడాతో చిత్తు చేస్తూ.. విజయభేరి మోగించడంతో పాయింట్ల పట్టిక మరింత రసవత్తరంగా మారింది. ఇప్పటికే రెండు టీమ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నా.. ప్లే ఆఫ్స్‌కు వెళ్లే టీమ్స్ ఏవో ఇంకా ఒక క్లారిటీ రాని పరిస్థితి. ఇప్పటి వరకు ఒక్క టీమ్ కూడా ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా చేరుకోలేదు. కానీ, పంజాబ్‌పై ఆర్సీబీ ఘన విజయంతో నిన్నటి వరకు ఉన్న లెక్కలు కాస్త మారియి.
కోల్‌కత్తా నైట్ రైడర్స్ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి.. నంబర్ వన్ ప్లేస్‌లో ఉండగా, రెండో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కూడా 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి ఉంది. ఈ రెండు టీమ్స్ దాదాపు ప్లే ఆఫ్స్‌కి వెళ్లినట్టే. ఆ రెండు జట్లు మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా, అందులో ఒక్కటి గెలిచిన ప్లే ఆఫ్స్‌కి వెళతాయి. మిగిలిన రెండు స్థానాల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ టీమ్స్ ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ఈ ఐదు టీమ్స్‌లో కూడా ఎస్‌ఆర్‌హెచ్‌కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ఒక్కటి గెలిచిన ప్లే ఆఫ్స్‌కి వెళుతుంది.
ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ కచ్చితంగా గెలిచి తీరాలి. ఒక్క మ్యాచ్ ఓడినా.. టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒక వేళ రెండు మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర టీమ్స్ ఫలితాలపై ఆధారపడాలి. టాప్ 3లో ఉన్న కేకేఆర్, రాజస్థాన్, ఎస్‌ఆర్‌హెచ్.. తమ మిగిలి ఉన్న అన్ని మ్యాచ్‌లు గెలిచి, ఆర్సీబీ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే.. ఆర్సీబీ నాలుగో స్థానంలో ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. గుజరాత్, రాజస్థాన్ తప్పనిసరిగా చెన్నైని ఓడించాలి. ముంబై లక్నోని ఓడించాల్సి ఉంటుంది. ఇక కేకేఆర్..ఎస్ఆర్‌హెచ్ టీమ్స్ జీటీని ఓడించాలి. లేదంటే స్వల్ప తేడాతో నెగ్గితే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…