Sreemukhi : హీరో శివ కార్తికేయన్ కథానాయకుడిగా, మడోన్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్’ మహావీరుడు. అదితి శంకర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించగా, ఏషియన్ సినిమాస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. జూలై 14న మహావీరుడు విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈ వెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో అడివి శేష్, స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, దర్శకుడు అనుదీప్ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అనుదీప్ స్టేజ్ మీదకి వచ్చాడంటే సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా అమాయకంగా కనిపించే ఆయన ఏదో ఒక చిలిపి పని చేసి వెళ్తాడు. కాని ఈ సారి మాత్రం అనుదీప్ ఎవ్వారం చూసి శ్రీముఖినే అనుదీప్ బుగ్గ గిల్లింది. ఆయన చెప్పే మాటలకి చాలా స్వీట్ అని పొగడ్తలు కురిపిస్తూ శ్రీముఖి అతని బుగ్గ గిల్లింది. ఇక ఈ కార్యక్రమంలో అనుదీప్ మాట్లాడుతూ.. శివకార్తియేన్ గారు పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా ఇంత సింపుల్ గా ఉండటం నాకు ఆశ్చర్యమనిపించింది. ఆయనకి వున్న స్టామినాకి మరిన్ని తెలుగు సినిమాలు చేయాలి.
దర్శకుడు అశ్విన్ మండేలా సినిమా చూసినప్పటి నుంచి నా స్నేహితుడు. నిర్మాత అరుణ్ ఎప్పటి నుంచో తెలుసు. ఈ సినిమా విజయం సాధించి వారిద్దరూ మరిన్ని తెలుగు సినిమాలు చేయాలి. సరిత గారిని చాలా రోజుల తర్వాత చూడటం ఆనందంగా వుంది. జులై 14న ఈ సినిమా అందరూ థియేటర్ లో చూడాలి అని కోరారు. ఇక దర్శకుడు మడోన్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘శివకార్తికేయన్ గ్రేట్ పెర్ఫార్మర్. ఇందులో ఆయన అద్భుతమైన నటన, యాక్షన్ యాంగిల్ చూస్తారు. అదితి శంకర్ ఎనర్జిటిక్‌గా చేసింది. సునీల్ వలనే ఈ సినిమా ఇంత గ్రాండ్‌గా విడుదలవుతుంది’ అని చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…