Sreeleela : ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘స్కంద. మాస్ యాక్షన్ సినిమాలకు పాపులర్ అయిన డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్కంద కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. సెప్టెంబర్ 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో స్కంద మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఈ క్రమంలో మూవీలోని పలు పాటలని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే పాటలలో శ్రీలీలీ ఎనర్జిటిక్ డ్యాన్స్ ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తుంది. ప్రోమోలోనే దుమ్ము రేపుతుంటే ఫుల్ వీడియోలో ఎంత సందడి చేయనుందా అని ప్రతి ఒక్కరు ముచ్చటించుకున్నారు. ఇక ఇదిలా ఉంటే స్కంద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరగగా, ఈ కార్యక్రమంలో శ్రీలీల ఏకంగా పాట పాడి అందరిని ఆశ్చర్యపరచింది.
ఇన్నాళ్లు శ్రీలీల నటనతో పాటు సూపర్ డ్యాన్సర్ అని పేరు ఉంది. తన డ్యాన్స్ తో ప్రేక్షకులని ఫిదా చేసింది ఆల్రెడీ. మాస్ డ్యాన్స్ హీరోలకు పోటీగా వారితో కలిసి డ్యాన్స్ వేస్తుండటంతో శ్రీలీల డ్యాన్స్ స్కిల్స్ కి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్ ని చూపించి మరోసారి ప్రేక్షకులందర్నీ ఆశ్చర్యపరిచింది శ్రీలీల. స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థమన్ తో కలిసి స్టేజిపై సాంగ్ పాడింది శ్రీలీల. ఇలాంటి ఈవెంట్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ తన టీంతో కలిసి సాంగ్స్ పెర్ఫార్మ్ చేస్తారనే సంగతి తెలిసిందే. స్కంద ఈవెంట్లో కూడా తమన్ తన టీంతో కలిసి ఈ సినిమాలోని సాంగ్స్ ని పెర్ఫార్మ్ చేయగా సినిమాలోని చిట్టి చిట్టి.. అనే సాంగ్ కి శ్రీలీల థమన్ తో కలిసి స్టేజిపై పాడింది.
శ్రీలీల పాట పాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది . ఇన్నాళ్లు డ్యాన్స్, నటన, తన అందంతో మెస్మరైజ్ చేసిన శ్రీలీల ఇప్పుడు సింగింగ్ తో కూడా అభిమానులని, ప్రేక్షకులని మెప్పించింది. శ్రీలీల ట్యాలెంట్ ని అంతా పొగిడేస్తున్నారు. ఇక స్కంద ఈవెంట్‌లో బాలయ్య..శ్రీలీలపై ప్రశంసలు కురిపించాడు. శ్రీలీల గురించి చెబుతూ, అందం,అభినయం, మంచి నటన కలగలిపిన అమ్మాయి మన తెలుగమ్మాయి కావడం గర్వంగా ఉంది. చాలా అరుదుగానే తెలుగు అమ్మాయిలు రాణించారు. ఇప్పుడు శ్రీలీల రాణిస్తుంది. ఎంతో డెడికేషన్‌తో వర్క్ చేస్తుంది. నాతో `భగవంత్ కేసరి`లో నటిస్తుందన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…