Dil Raju : తెలుగు సినిమాలకి దాదాపు పది నేషనల్ అవార్డులు రావడంపై ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు ప్రముఖులు సంతోషం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న వారందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. నేషనల్ ఫిల్మ్ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటడంపై ప్రొడ్యూసర్ దిల్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. RRR, పుష్ప టీమ్ లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో విడుదల చేశారు. 69వ జాతీయ అవార్డ్స్ విజేతలందరికీ అభినందనలు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డ్ పొందిన అల్లు అర్జున్ గారికి అభినందనలు.
ఫస్ట్ టైమ్ ఒక తెలుగు హీరోకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం అల్లు అర్జున్ గారికి తెలుగు చిత్ర పరిశ్రమకు గ్రేట్ మూమెంట్. జాతీయ అవార్డులు పొందిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ అందరికీ పేరుపేరునా అభినందనలు. రాజమౌళి గారు ప్రతి సినిమాతో తెలుగు సినిమాని మరోస్థాయికి తీసుకెళుతున్నారు. అందుకు రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. దేవీశ్రీ ప్రసాద్ గారికి స్పెషల్ కంగ్రాజులేషన్స్. దేవిశ్రీ తో మాది గ్రేట్ జర్నీ. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేశాం. పుష్ప సినిమాకి దేవిశ్రీ కి నేషనల్ అవార్డ్ రావడం చాలా అనందంగా వుంది. ఉప్పెన చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు బుచ్చిబాబు, టీం అందరికీ అభినందనలు.
మొదటి సినిమాతోనే బుచ్చిబాబుకు, అలాగే ఫస్ట్ టైం మైత్రీ మూవీ మేకర్స్ కి నేషనల్ అవార్డ్ రావడం చాలా అనందంగా వుంది. కొండపొలం సినిమాలోని పాటకు అవార్డ్ పొందిన చంద్రబోస్ గారికి అభినందనలు. మొన్ననే ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చారు. ఇప్పుడు నేషనల్ అవార్డ్ తీసుకోబోతున్నారు. తెలుగు సినిమాకి ఇన్ని అవార్డులు రావడం, ఇవాళ ఇండియన్ సినిమాలో తెలుగు సినిమాకి ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చేసిన మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు అని అన్నారు. దిల్ రాజు మాటలు చూస్తే ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ అవార్డ్ దక్కించుకోకపోయిన గేమ్ చేంజర్ సినిమాతో తప్పక అందుకుంటాడని అనుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…