Ram Pothineni : రామ్‌కి మాస్ వార్నింగ్ ఇచ్చిన బాల‌య్య‌

Ram Pothineni : ఎన‌ర్జిటిక్ హీరో రామ్ న‌టించిన తాజా చిత్రం స్కంద‌ . రామ్‌, శ్రీలీల, సాయీ మంజ్రేకర్‌ హీరోహీరోయిన్లుగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన `స్కంద` చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. నేడు ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో జరిగింది. సినిమా సెప్టెంబర్‌ 15న రిలీజ్‌ కానుంది.ఈ క్ర‌మంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. కార్యక్ర‌మానికి బాల‌య్య ముఖ్య అతిథిగా హాజ‌రై సంద‌డి చేశారు. రామ్‌ మాట్లాడుతూ, బాలయ్యని ఆకాశానికి ఎత్తేశాడు. అవార్డులు, రివార్డులు కాదు, ఇలాంటి క్రేజ్‌ ఉండాలన్నారు. బాలయ్య పాత తరం, ఇప్పటితరం, కొత్తతరం వాళ్లతో కూడా డాన్సులు వేయిస్తాడని, వాళ్లు కూడా జై బాలయ్య అనేలా చేస్తాడని, మూడు తరాలను అలరించే ఏకైక హీరో బాలయ్య అని తెలిపారు రామ్‌.

పెద్దవాళ్లని, యూత్‌ని, అమ్మాయిలను, అబ్బాయిలను, మాస్‌, క్లాస్ తేడా లేకుండా అందరు జై బాలయ్య అంటున్నారని, షూటింగ్‌లు పూర్తయ్యాక కూడా చివర్లో జై బాలయ్య అంటున్నారని రామ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈవెంట్ లో రామ్‌కి బాలయ్య వార్నింగ్‌ ఇవ్వడం గమనార్హం. వినకూడనివి వింటే మామూలుగా ఉండదంటూ హెచ్చరించారు. కొన్ని వినిపిస్తున్నాయంటూ తనదైన స్టయిల్‌లో వార్నింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశాడు బాలయ్య. దీంతో అటు రామ్‌, ఇటు బాలయ్య మధ్య స్టేజ్‌పై కాసేపు సరదా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక రామ్.. నా లక్కూ మీరే, నా కిక్కూ మీరే` అని చెప్పడంతో ప్రాంగణం హోరెత్తిపోయింది.

balakrishna warning to ram pothineni
Ram Pothineni

ఇక బాలకృష్ణ మాట్లాడుతూ, రామ్‌గురించి చెబుతూ తమ్ముడు రామ్‌ అంటూ సంభోదించారు. `మా తిక్కకి లెక్కలేని మహాతిక్క.. రామ్‌ పోతినేని. ఆయన పీహెచ్‌డీ చేస్తుంటే, నేను డిగ్రీ చేస్తున్నా, ఆయన్ని నేను ఫాలో అవుతున్నా, మళ్లీ ఆయన నన్ను ఫాలో అవుతున్నాడు` అంటూ క్రేజీగా మాట్లాడారు బాలయ్య… తెలంగాణ యాస, భాషలో ‘ఇస్మార్ట్ శంకర్’ తీసి నాకూ సవాల్ విసిరారు. నేను `భగవంత్ కేసరి`తో తెలంగాణలో దిగుతున్నాను. ఇప్పుడు ‘ఇస్మార్ట్ శంకర్2’లో మళ్లీ రాబోతుండటం సంతోషం. ఈ విషయంలో ఆయనది పీహెచ్‌డీ అయిపోయింది. నేనింకా డిగ్రీనే చేస్తున్నారు. ఆయన్ని నేను ఫాలో అవుతున్నా. `ఇస్మార్ట్ శంకర్‌2`తో మళ్లీ ఆయన నన్ను ఫాలో అవుతున్నాడ`ని తెలిపారు బాలయ్య. అందుకు రామ్‌ స్పందిస్తూ `నేను చదివే స్కూల్‌లో మీరే హెడ్‌ మాస్టర్‌` అని చెప్పగా, బాలయ్య ఆనందంతో ఉప్పొంగిపోయారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago