Sreeleela : శ్రీలీల.. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ బిజీ హీరోయిన్ అని చెప్పాలి. ఈ అమ్మడి కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులెడుతోన్న సంగతి తెలిసిందే. పట్టిందల్లా బంగారమే అవుతుంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకూ ఎవర్నీ విడిచి పెట్టకుండా అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదలడం లేదు. సైన్ చేయడం..అడ్వాన్స్ తీసుకోవడం.. యాక్షన్ చెప్పడం అన్నట్లు సాగిపోతుంది. బాలయ్య…పవన్…మహేష్ లాంటి అగ్ర స్టార్ల నుంచి నితిన్..రామ్…వైష్ణవ్ తేజ్ అందర్నీ రౌండప్ చేసింది ఈ అందాల ముద్దుగుమ్మ. ‘పెళ్లి సందడి’ అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్ రేంజ్ కి చేరుకుంది. అందం..అభినయంతో పాటు ఇక్కడ అమ్మడికి అదృష్టం కలిసొచ్చిందనాలి.
ఎంతో మంది భామలున్నా! అవకాశాలన్ని ఆమెనే వెతుక్కుంటూ మరీ వెళ్తున్నాయి. రష్మిక మందన్నా తర్వాత అంత వేగంగా పాపులర్ అయిన నటి శ్రీలీల మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ధమాకా సినిమా తో మంచి విజయాన్ని ఈమె దక్కించుకోవడం తో ఏకంగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమా లో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఈమె నటించిన సినిమా ల్లో స్కంద సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందిన స్కంద సినిమా డిజాస్టర్ అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.దీంతో శ్రీలీలకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్నట్టు మాట్లాడుతున్నారు.
అయితే శ్రీలీల టాలీవుడ్ కంటే ముందు కన్నడంలో కిస్ అనే సినిమా చేసింది. ఈ మూవీని ఐ లవ్ యూ ఇడియట్ పేరుతో తెలుగులోకి డబ్ చేశారు. విరాట్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఏపీ అర్జున్ దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆహా ఓటీటీలో రిలీజైంది. శ్రీలీల డెబ్యూ మూవీ అయిన ఐ లవ్ యూ ఇడియట్ చిత్రంలో శ్రీలీల హీరోతో ఘాటు లిప్ లాక్ చేసింది. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా వామ్మో శ్రీలీల చాలా బాగా రెచ్చిపోయావుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…