Pakistan Cricket Team : మరి కొద్ది రోజులలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ మొదలు కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు సుదీర్ఘ కాలం తర్వాత భారత్‌లో అడుగుపెట్టింది. వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు వచ్చిన ఆ జట్టు సభ్యులకు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది. బుధవారం (సెప్టెంబర్ 27) రాత్రి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పాకిస్థాన్ టీమ్ చేరుకుంది. అక్కడ నుంచి ప్రత్యేక బస్సులో వారు బస చేయనున్న హోటల్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో సెక్యూరిటీ సిబ్బంది, ఇతర ప్రయాణికులు చేతులు ఊపుతూ పాకిస్థాన్ జట్టు సభ్యులకు స్వాగతం పలికారు. సెల్ ఫోన్లలో దృశ్యాలను బంధించేందుకు పోటీపడ్డారు.
పాకిస్థాన్ టీమ్‌కు స్వాగతం పలికేందుకు కొంత మంది స్థానికులు ఎయిర్‌పోర్టు చేరుకొని వారికి ఘన స్వాగతం పలికారు.. బస్సు వద్ద పెద్ద సంఖ్యలో గుమిగూడారు. బాబర్ ఆజం బాయ్ అంటూ పలువురు పెద్దగా కేకలు వేశారు. తమ టీమ్ బస్సు డ్రైవర్‌కు ప్రేమ పూర్వకంగా విష్ చేస్తూ బస్సులో ఎక్కి కూర్చున్నారు.ఇక శంషాబాద్ విమానాశ్రయం నుంచి పార్క్ హయత్‌కు చేరుకున్న పాక్ జట్టుకు హోటల్‌లోనూ ఘన స్వాగతం లభించింది. పాకిస్థాన్ క్రికెట్ జట్టు భారత్‌కు రావడం ఏడేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక భారత్ – పాక్ తలపడే మ్యాచ్‌కు ఉత్కంఠ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు! భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నా..క్రీడాసంబంధాలు మాత్రం అంటీముట్టనట్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. క్రికెట్ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
ప్రపంచ టాప్ ర్యాంక్ బ్యాటర్ బాబర్ అజమ్ నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టు 7 సంవత్సరాల విరామం తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టింది. లాహోర్ నుంచి దుబాయ్ మీదుగా మన హైదరాబాద్ నగరానికి చేరుకొంది.హైదరాబాద్‌లో అడుగుపెట్టిన పాక్ జట్టు తన మొదటి వార్మప్ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. 7 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన పాకిస్థాన్ జట్టుకు శుభారంభం చేసే అవకాశం రాలేదు. బాబర్ ఆజం నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు తమ తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో 5 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…