Roja : గత కొద్ది రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయో మనం చూశాం. బాలయ్య మీసం తిప్పడం, దానిని వైసీపీ నాయకులు విభేదించడం, తెలుగు తమ్ముళ్లు గోల చేయడం ఇలా నానా రభస జరిగింది. ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. నైపుణ్యాభివృద్ధి కుంభకోణం కేసులో అరెస్టైన నాటి నుండి అధికార వైసీపీ నేతలు వాగ్భాణాలు సంధిస్తున్నారు. ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీంతో చంద్రబాబు, ఆయన చేసిన అవినీతిపై అసెంబ్లీ సాక్షిగా ఏకరువు పెడుతున్నారు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.
ప్రతిపక్షాలనుద్దేశించి అసెంబ్లీలో వైసీపీ పర్యాటక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా.. రజనీకాంత్ స్టైల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళా సాధికారికతను ఉద్దేశించి అసెంబ్లీలో జరిగిన చర్చలో రోజా మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో గత నాలుగున్నరేళ్లల్లో మహిళలకు దక్కుతున్న అవకాశాలను చూస్తే.. దేవతలంతా మూకుమ్మడిగా జగనన్నను ఆశీర్వదించి ఏపీకి ముఖ్యమంత్రిగా పంపించారనిపిస్తుందని అన్నారు.కసాయిని గొర్రె నమ్ముతుందేమో కానీ ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును మాత్రం నమ్మరని మంత్రి రోజా అన్నారు.
వాలంటీర్ వ్యవస్థతో మహిళలకు జగన్ అనేక పథకాలు తీసుకు వచ్చారన్నారు. ఆడపిల్లల కష్టాలు జగన్‌కు తెలుసునన్నారు. నాలుగున్నరేళ్లుగా ప్రతి ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారని చెప్పారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ అని, ఆయనది బోగస్ ఆలోచన అన్నారు. చంద్రబాబు చీటర్ అయితే, జగన్ లీడర్ అన్నారు. అయితే ఆ సమయంలో జగన్ కునుకు తీస్తున్నట్టు కనిపించగా, ఆ సమయంలో జగనన్న జగనన్న అంటూ అరవడంతో ఆయన ఉలిక్కిపడి లేచి నవ్వడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే జగన్‌ను ఇంటికి పంపిస్తామన్న వ్యక్తి జైలుకు వెళ్లాడని, భయం ఎలా ఉంటుందో జగన్‌కు పరిచయం చేస్తానని చెప్పిన లోకేశ్ భయపడి ఢిల్లీకి పారిపోయాడని ఎద్దేవా చేశారు రోజా.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…