Sreeleela : వీరసింహారెడ్డి చిత్రంతో మంచి విజయం అందుకున్న నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం భగవంత్ కేసరి.ఈ సినిమాపై రోజురోజుకు అందరిలో భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి .ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో శ్రీలీల కనిపించనుంది. తొలిసారిగా ఈ మూవీ ద్వారా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో ఆయన విలన్ గా కనిపించనున్నారు.ఇప్పటికే భగవంత్ కేసరి నుండి థమన్ అందించిన సాంగ్స్, ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ ఇలా అన్ని అందరినీ ఆకట్టుకుని ఆడియన్స్, నందమూరి ఫ్యాన్స్ లో భారీ స్థాయి హైప్ ఏర్పరిచాయి.
రీసెంట్‌గా ఈ మూవీ యొక్క సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అవ్వగా దీనికి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇక ఈ మూవీ రన్ టైం 2గం. 44 ని.లు గా ఉంది. కాగా ఈ మూవీని చూసిన సెన్సార్ వారు మెచ్చుకున్నట్లు టాక్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రానుంది.ఈ క్రమంలో తాజాగా సినిమాకి సంబంధించిన ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో శ్రీలీల, బాలకృష్ణ సందడి చేశారు. బాలకృష్ణ, శ్రీలీల కలిసి సినిమాలోని ఎమోషనల్ సాంగ్ కి స్టేజి మీద స్టెప్పులు వేయడం బాగా ఆకట్టుకుంది. బాలయ్య కంటే ఒకింత ఆలస్యంగా వచ్చిన అమ్మాయిని ఏమి అనకుండా దగ్గరగా వచ్చినప్పుడు తల మీద చేయి పెట్టి ఆశీర్వదించడంతో మొదలుపెట్టి చిచ్చా అన్న పిలుపుని సార్ధకం చేసేలా నిజంగానే ఆమెను కంటికి రెప్పలా బయట కూడా ప్రవర్తిస్తున్న తీరు హత్తుకునేలా ఉంది.
అయితే బాలకృష్ణ స్టేజ్ కింద కూర్చొని శాండ్ విచ్ తింటున్న సమయంలో పక్కనే శ్రీలీల ఉంది. ఆయన తింటున్నప్పుడు శ్రీలీల ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ కాస్త తేడాగా అనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు,వీడియోలు వైరల్ అవతుండగా, ఇది చూసిన వారందరు నాకు పెట్టకుండా బాలయ్య ఒక్కడే తినేస్తున్నాడు అన్నట్టు శ్రీలీల ఎక్స్‌ప్రెషన్ ఇచ్చిందని అంటున్నారు. ఇక భగవంత్ కేసరి కథ మొత్తం శ్రీలీల పాత్రనే కేంద్రంగా చేసుకుని తిరుగుతుంది. ఆమెను మానసికంగా శారీరకంగా ఎలాంటి ఒత్తిళ్లనైనా తట్టుకునేలా తీర్చిదిద్దాలని తాపత్రయపడే క్యారెక్టరే బాలయ్య. పనిలో పనిగా ఆ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్న గ్రౌండ్ ఫ్లోర్ కామెంట్స్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. ఇంట్లో మోక్షజ్ఞతో తాను చాలా స్నేహంగా ఉంటానని ఆ చనువుతోనే శ్రీలీల ప్రస్తావన వచ్చినపుడు అలా అన్నాడని మరోసారి నొక్కి చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…