Roja : మంత్రి రోజా ఇటీవల తెగ వార్తలలో నిలుస్తుంది. ఆమెపై టీడీపీ మాజీ మంత్రి దారుణమైన విమర్శలు చేయగా, ఆ సమయంలో చాలా బాధపడింది. ఆమెపై విమర్శలు చేసినందుకు ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీమణులు మండిపడ్డారు.ఈ నేపథ్యంలో రోజా పేరు మారు మ్రోగింది. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లిని మంత్రి ఆర్ కే రోజా ఆదివారం దర్శించుకున్నారు. దసరా శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా ఆమె అమ్మవారి ఆశీస్సులకోసం వచ్చారు. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగనే సీఎం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మ ఆశీర్వాదంతోనే 2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలించిందని అన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం జగన్ కు దుర్గమ్మ తల్లి ఆశీర్వాదాలు ఎన్నటికీ ఉండాలని ఆకాంక్షించారు. రానున్న ఎన్నికల్లో జగన్ శత్రువులను జయించి పేద ప్రజల సేవ కోసం మళ్లీ అధికారం చేపట్టాలని అన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇక రోజా రీసెంట్‌గా గుంటూరు అట్టహాసంగా నిర్మించిన శిల్పారామాన్ని మంత్రి రోజా ప్రారంభించారు. శిల్పారామం అందుబాటులోకి రావడంతో గుంటూరు మరింత పర్యాటక ప్రాంతంగా మారనుంది. శిల్పారామం అనగానే హస్తకళా వస్తువులు గుర్తుకొస్తాయి. చెవి పోగుల, దుస్తులు, గాజులు, హ్యాంగ్స్ బ్యాగ్స్, చెప్పులు ఇలా అనేక రకాల వస్తువులు ఒకే చోట కనిపించి మగువల మనసు దోచేస్తాయి.
అయితే శిల్పారామం ప్రారంభోత్సవం కార్యక్రమంలో రోజా ప్రవర్తన అందరిని ఆశ్చర్యపరచింది.ఆమెకి శాలువా కప్పి ఓ వ్యక్తి దండం పెట్టాక రోజా వెరైటీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి సారీ చెప్పాడు. మొత్తానికి రోజా ప్రవర్తన మొత్తం ఆ సమయంలో అందరికి షాక్ ఇచ్చింది. ఇక రోజా మొక్క కూడా నాటారు. అనంతరం ఫొటోలకి పోజులిచ్చారు. గుంటూరులో శిల్పారామం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు మంత్రి రోజా. నాలుగు కోట్ల యాభై ఆరు లక్షల వ్యయంతో శిల్పారామం నిర్మించామని తెలిపారు. కుటుంబ సభ్యులతో హాయిగా వచ్చి సేదతీరి, బోటింగ్‌లో విహరించే అవకాశం ఉందన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…