Rashid Khan : ఇంగ్లండ్‌పై గెల‌వ‌డానికి కార‌ణం చెప్పిన ర‌షీద్ ఖాన్.. ఆయ‌న స్పూర్తి వ‌ల్ల‌నేన‌ట‌..!

Rashid Khan : వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో ఊహించ‌ని రిజ‌ల్ట్ రావ‌డం మ‌నం చూశాం. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు పసికూన ఆఫ్గానిస్తాన్ షాకిచ్చింది. అఫ్గాన్ నిర్దేశించిన 285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లండ్ 215 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బట్లర్ రెండో ఇన్నింగ్సులో మంచు ప్రభావం చూపిస్తుందనే ఆలోచనతో బౌలింగ్ ఎంచుకున్నాడు. కాని తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ బ్యాటర్లు అంచనాలకు మించి రాణించారు. గుర్భాజ్ 57 బంతుల్లో 80 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు, ఇక్రమ్ అళిఖిల్ 58 పరుగులతో రాణించడంతో అఫ్గానిస్తాన్ జట్టు 49.5 ఓవర్లలో 284 పరుగులు ఆలౌటైంది. చివర్లో ముజీబ్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ అఫ్గాన్ భారీ స్కోరుకు సాధించ‌డానికి ఉప‌యోగ‌ప‌డింది.

ఇక ల‌క్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తేలిపోయింది. ఒక్క హ్యారీ బ్రూక్ (66) మినహా అందరూ విఫలమయ్యారు. దీంతో ఈ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేజ్ చేయలేకపోయింది. చివర్లు 40.3 ఓవర్లలో 215 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ వరుసగా మూడు వికెట్లు కూడా తీసుకున్నాడు. పిచ్ నుంచి స్పిన్నర్లకు కొంత సహకారం లభించడంతో ముజీబ్ రెచ్చిపోయాడు. అతనితోపాటు రషీద్ ఖాన్ కూడా మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఇలా ఇంగ్లండ్ తేలిపోవడం చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు బాజ్‌బాల్ ఆడే ముందు బ్యాటింగ్ ఎలా చేయాలో పిక్‌ను బట్టి అందరూ ఇంగ్లండ్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.

Rashid Khan told this is the reason they won against england
Rashid Khan

ఇక ఇదిలా ఉంటే విజయం తర్వాత ఆఫ్గాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఎమోషనల్ అయ్యాడు. మా దేశంలో సంతోషానికి కారణం ఏదైనా ఉందంటే? అది ఒక్క క్రికెట్ లోనే. మేం మ్యాచ్ లు గెలిస్తే.. మా దేశంలో సంతోషం వెళ్లివిరుస్తుంది. అయితే ప్రస్తుతం ఎంతో బాధలో ఉన్న మాకు ఇంగ్లాండ్ పై విజయం కాస్త ఆనందాన్ని ఇచ్చింది. తాజాగా వచ్చిన భూకంపంలో మేం సర్వస్వం కోల్పోయాం. ఈ విజయం భూకంప బాధితులకు అంకితం ఇస్తున్నాం” అంటూ భావోద్వేగానికి లోనైయ్యాడు రషీద్. ఇక ఈ మ్యాచ్ లో వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అమౌంట్ ను భూకంప బాధితులకు డొనేట్ చేశాడు ముజీబ్ రెహ్మన్. కాగా.. రషీద్ ఖాన్ తన టోర్నీ మెుత్తం ఫీజును భూకంప బాధితులకు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ ప్ర‌జ‌లు నిజ‌మైన ప్రేమ‌ను క‌లిగి ఉన్నారన్నాడు. ఢిల్లీ ప్ర‌జ‌ల ప్రేమ అద్భుతం అని చెప్పాడు. మైదానానికి వ‌చ్చి మ‌ద్ద‌తుగా నిలిచిన‌ అంద‌రికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. స్టేడియంలో ల‌భించిన మ‌ద్ద‌తే ముందుకు సాగ‌డానికి దోహ‌ద‌ప‌డింద‌న్నారు. ఐపీఎల్ కూడా త‌మ‌కి ఎంతగానో ఉప‌యోగ‌ప‌డింద‌ని చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago