Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ చాలా రోజుల తర్వాత వెండితెరపై సందడి చేయబోతుంది. టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో సామాజిక సంస్కర్త, సంఘ సేవకురాలు హేమలత లవణం పాత్రను పోషిస్తున్నది నటి రేణూ దేశాయ్. రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకురానుంది. నేటితరంలో స్ఫూర్తినింపే పాత్ర ఆమెది. ఈ పాత్ర కోసం హేమలత లవణం మేనకోడలిని కలుసుకొని చాలా సమాచారాన్ని సేకరించాను. ఆమె బాడీలాంగ్వేజ్ గురించి తెలుసుకొని అదే విధంగా తెరపై కనిపించే ప్రయత్నం చేశా. అలాగే తెలుగులో కూడా స్పష్టంగా మాట్లాడేలా శిక్షణ తీసుకున్నా అని రేణూ దేశాయ్ చెప్పారు.
హేమలత లవణం పాత్ర తన వ్యక్తిగత జీవితంలో చాలా మార్పులను తీసుకొచ్చింది అని పేర్కొంది. సామాజికంగా మరిన్ని కార్యక్రమాలు చేయాలనే స్ఫూర్తినిచ్చింది. చిన్నపిల్లలు ఎవరూ ఆకలితో ఉండకూడదన్నది నా లక్ష్యం. నా దిశగా మరిన్ని ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా. ఈ సినిమా ట్రైలర్ చూసిన నా కూతురు ‘వయసుకు తగిన పాత్ర పోషించినందుకు చాలా గర్వంగా ఉందమ్మా’ అని చెప్పింది. అదే నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అనుకుంటున్నా అని రేణూ దేశాయ్ పేర్కొంది.ఆ రోజుల్లోనే చంబల్, బుందేల్‌ఖండ్ వంటి బందిపోటు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సంస్కరణలు చేపట్టారు. అంటరానితనం, జోగినీ వ్యవస్థపై పోరాటం చేశారు. అలాంటి గొప్ప మహిళ పాత్రను పోషించడం నా పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నా అని పేర్కొంది.
ఇక తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు అయింది. అయినా ‘బద్రీ’ ఈ మధ్యనే రిలీజ్ అయిందనే ఫీలింగ్ వస్తోంది. ఇంతకాలంగా నేను తెలుగు సినిమాలు చేయకపోయినా, మీరంతా అదే ప్రేమను చూపిస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో నన్ను ఫాలో అవుతూ వచ్చారు .. మీ అభిమానాన్ని ఎప్పటికీ మరిచిపోలేను” అన్నారు. “ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. రవితేజగారి వంటి సీనియర్ స్టార్ తో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. ఆయన తీసుకున్న నిర్ణయం నాకు ఎంత ఇంపార్టెంట్ అనేది ఆయనకి తెలియదు. ఈ వేదిక ద్వారా .. పర్సనల్ గాను రవితేజగారికి థ్యాంక్స్ చెబుతున్నాను. అంతా కూడా ఈ నెల 20వ తేదీన థియేటర్స్ కి వెళ్లి ఈ సినిమా చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను” అని చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…