Sreeleela : పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటుంది. పెళ్లి సందD సినిమాలో యాక్టింగ్‌తో పాటు తన అందచందాలతో వావ్ అనిపించింది. శ్రీలీల కేవలం గ్లామర్ తోనే కాకుండా నటనతోనూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో 7 సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. శ్రీలీలను లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చింది దర్శకుడు రాఘవేంద్రరావు అని తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీలో అవార్డు ఫంక్షన్స్ జరిగాయంటే ఆ హంగామా మాములుగా ఉండదు.
స్టేజ్ పై హీరోహీరోయిన్ల డాన్స్ పెర్ఫార్మన్సులను కళ్ళార్పకుండా చూస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ గ్లామర్ డ్రెస్సింగ్ స్టయిల్ తో డాన్స్ తో అదరగొడతారు. తాము నటించిన సినిమాలలోని పాటలే కాకుండా.. ట్రెండింగ్ లో ఏ సాంగ్స్ ఉన్నా డాన్స్ చేస్తుంటారు. తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీలీల.. పుష్ప సినిమాలోని సామి సామి పాటకు సైమా అవార్డుల ఫంక్షన్ లో అదిరిపోయే మాస్ డాన్స్ చేసింది. దీంతో ఇప్పుడు శ్రీలీల డాన్స్ పెర్ఫార్మన్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
2022 సైమా అవార్డుల వేడుకలో సౌత్ ఇండియన్ సెలబ్రిటీలంతా ఎవరి స్టైల్ లో వారు పెర్ఫర్మ్ చేశారు. ఇప్పుడైతే సామి సామి అంటూ శ్రీలీల చేసిన మాస్ పెర్ఫార్మన్స్ చూసి ఆమె ఫ్యాన్స్ తో పాటు పుష్ప మూవీ ఫ్యాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా శ్రీలీల ఓవైపు మాస్ రాజా రవితేజ సరసన ధమాకా సినిమా చేస్తోంది. మరోవైపు నవీన్ పొలిశెట్టి సరసన అనగనగా ఒక రాజు మూవీలో నటిస్తోంది. ధమాకా సినిమా డిసెంబర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…