Saravanan The Legend : అరుళ్ శరవణన్ ది లెజెండ్ మూవీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా అన్నింటి మీద ట్రోలింగ్ చేశారు. ఆఖరికి జర్నలిస్టుల సమావేశంలో కూడా ఇంత బడ్జెట్ తో సినిమా ఏంటి అన్నట్టుగా ప్రశ్నించారు? ఎట్టకేలకు ది లెజెండ్.. పాన్ ఇండియా చిత్రం జూలై 28న విడుదలైంది. ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా వస్తుంది అని తెలిసినప్పటి నుండి ట్రోలర్స్ కు మంచి ఫీస్ట్ దొరికినట్టు అయ్యింది. ఎందుకంటే ఇందులో హీరోగా నటిస్తున్న అరుళ్ లుక్స్ గురించి, 52 ఏళ్ళ వయసులో హీరోగా చేస్తూ.. రూ.80 కోట్లు బడ్జెట్ పెడుతున్నాడేంటీ.. ఇతను ఏమైనా పిచ్చోడా అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
సినిమాపై నెగిటివిటీ ఉన్నప్పటికీ కొంతవరకు ఈ జనాలు ఈ మూవీని చూడడానికి వెళ్లారు. కానీ బడ్జెట్ ఎక్కువ పెట్టడం వల్ల ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చింది. టెక్నికల్ గా సినిమాకు కావాల్సినవన్నీ బాగా సెట్ అయినప్పటికీ, హీరోగా మాత్రం శరవణన్ సెట్ కాలేదని.. ఆయన యాక్టింగ్ కామెడీగా ఉందనే విమర్శించారు ప్రేక్షకులు. అయినా అవేవీ లెక్క చేయకుండా హీరో కావాలనే డ్రీమ్ కంప్లీట్ చేసుకున్నాడు. అయితే.. థియేట్రికల్ రిలీజ్ తర్వాత సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయకపోవడమే చర్చనీయాంశంగా మారింది.
జూలైలో విడుదలైన ఈ సినిమా.. డిసెంబర్ దగ్గరపడినా ఓటీటీ కన్ఫర్మ్ చేయలేదు. ఈ క్రమంలో తాజాగా సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ది లెజెండ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ హాట్ స్టార్ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది. కాగా.. డిసెంబర్ లో సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో శరవణన్ సరసన ఊర్వశి రౌటేలా, యాషిక ఆనంద్, రాయ్ లక్ష్మి హీరోయిన్లుగా నటించగా హారిస్ జయరాజ్ సంగీతం అందించాడు. చూడాలి మరి ది లెజెండ్ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…