Sreeleela : రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ శ్రీలీల. ఇప్పుడు ఎక్కడ చూసిన శ్రీలీల పేరే వినిపిస్తుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన శ్రీలీల కూడా మన దగ్గర బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తొలి సినిమాతోనే అందం, అభినయం, చలాకీ తనంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ ఈ అమ్మడికి మాత్రం మంచి పేరు వచ్చింది. పెళ్ళిసందడి సినిమా తర్వాత వెంటనే మాస్ రాజా రవితేజ తో కలిసి ధమాకా సినిమా చేయగా, చిత్రం మంచి విజయం సాధించడంతో శ్రీలీలకి ఆఫర్స్ క్యూ కట్టాయి. కుర్ర హీరోల సినిమాలతో పాటు స్టార్ హీరోల చిత్రాలలోను నటిస్తుంది.
మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తోంది శ్రీలీల. ఇక రామ్-బోయపాటి సినిమా చేస్తుండగా, ఆమె బర్త్ డే సందర్భంగా చిత్రం నుంచి కూడా శ్రీలీల లుక్ రిలీజైంది. ఇందులో మోడ్రన్ గెటప్ లో, నోటిలో వేలు పెట్టుకొని, నాటీగా కనిపిస్తున్న శ్రీలల ఫొటోను విడుదల చేశారు. అటు భగవంత్ కేసరి నుంచి కూడా శ్రీలీల పోస్టర్ వచ్చింది. క్యూట్ స్మైల్ తో సింపుల్ గా ఉంది. నితిన్-వక్కంతం సినిమాలో కూడా శ్రీలల హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆదికేశవ సినిమాతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా కూడా చేస్తుంది. ఆహా కోసం బన్నీతో కలిసి ఓ ప్రాజెక్టు చేస్తోంది శ్రీలీల. దీనికి సంబంధించి కూడా ఓ లుక్ రిలీజైంది.
ఇలా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంది శ్రీలీల. ఈ అమ్మడికి సంబంధించిన ఓవీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. పెళ్లి సందడి మూవీ ఈవెంట్‌కి చిరంజీవి గెస్ట్‌గా రాగా, ఆయన ముందు స్టేజ్ మీద మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. చిరంజీవి డ్యాన్స్ ఇన్సిపిరేషన్‌గా తీసుకొని తాను సినిమాలలోకి వచ్చానని చెప్పిన ఈ భామ తాను చిరంజీవి డైలాగ్ ఒకటి చెబుతానని అంది. అయితే ముందు కొంచెం చెప్పి తర్వాత చెప్పడానికి ఇబ్బంది పడింది. ఆ సమయంలో శ్రీలీల బాధని చూసి చిరంజీవి నవ్వుకున్నారు. ఆ సమయంలో ఆయన కంట కన్నీళ్లు కూడా వచ్చాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…