Pawan Kalyan : జనసేనాని పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా ప్రచారంలో స్పీడ్ పె్చారు.. వారాహి యాత్ర మొదలు పెట్టిన పవన్ తన లక్ష్యం ఏంటో స్పష్టం చేస్తున్నారు . ఇన్నాళ్లు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న పవన్ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి సారించారు. జూన్ 14 నుండి వారాహి యాత్ర ప్రారంభించారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో జగన్ నమ్ముకున్న నినాదాన్నే ఇప్పుడు పవన్ ఎంచుకున్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ఓటర్లను అభ్యర్ధిస్తున్నారు. పదేళ్ల పాటు అధికారం ఇవ్వాలని కోరుతున్నారు. పనితీరు బాగాలేదంటే రాజీనామా చేసి దిగిపోతామని చెప్పుకొచ్చారు.
2024, 2029లో కనుక మీరు జనసేనను నమ్మితే.. బంగారు ఆంధ్రప్రదేశ్‌గా మార్చి చూపిస్తానన్నారు పవన్. ఒక్క పదేళ్లు అవకాశం ఇవ్వాలని.. ఒకవేళ నచ్చలేదంటే తానే స్వయంగా దిగిపోతానని చెప్పారు. కుల రాజకీయాలకు స్వస్తి చెప్పే బాధ్యత జనసేన తీసుకుంటుందన్నారు. మోసగాళ్లను నమ్మి ప్రలోభాలకు గురికావొద్దని సూచించారు. అధికారంలోకి వచ్చాక రెండేళ్ల సమయం ఇవ్వాలని కోరిన పవన్ ..పనితీరు బాగాలేదంటే దిగిపోతామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి.
పవన్ కల్యాణ్ గత సమావేశాల్లో ఓపెన్ గా వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో పొత్తులు ఉంటాయని చెప్పుకొచ్చారు. సీఎం పదవి కోరాలంటే..ఇతర పార్టీలు మనకు ఎందుకు ఇస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిపించాలని..అప్పుడు ముఖ్యమంత్రి సీటు గురించి మాట్లాడుదామంటూ ప్రతిపాదించారు. అయితే తాజా స్పీచ్ లో మాత్రం తాను కలిపి వస్తానో…ఒంటరిగా వస్తానో ఇంకా నిర్ణయించుకోలేదంటూ కొత్త అంచనాలకు కారణమయ్యారు. అటు బీజేపీ అగ్రనేతలు వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోణలతో ఇప్పుడు అధికార పార్టీ నేతలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. దీని పైనా పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు. పొత్తుల అంశంపై రానున్న రోజులలో క్లారిటీ ఇస్తాడని కొందరు చెప్పుకొస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…