Sree Leela : క్రేజ్ పెంచుకుంటూ పోతున్న శ్రీలీల‌.. అమ్మ‌డి హ‌వా మాములుగా లేదుగా..!

Sree Leela : ఇప్పుడు టాలీవుడ్ లో శ్రీలీల జపం చేస్తున్నారు నిర్మాత‌లు. పూజా హెగ్డే, ర‌ష్మిక లాంటి స్టార్ హీరోయిన్స్ ఉన్న‌ప్ప‌టికీ శ్రీలీల‌ని త‌మ సినిమాల‌లో తీసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. యంగ్ హీరోయిన్ శ్రీలీలకి టాలీవుడ్‌లో డిమాండ్ బాగా పెరిగిపోయింది. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన పెళ్లిసందD మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వరుస అవకాశాల్ని దక్కించుకుంటూ వ‌స్తుంది.. ఇప్పటికే రవితేజతో కలిసి ‘ధమాకా’ మూవీలో జతకట్టగా.. బోయపాటి శ్రీను- రామ్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలోనూ శ్రీలీలనే హీరోయిన్. అలానే ఓ 2-3 సినిమాలు చర్చ దశలో ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

రీసెంట్‌గా ధ‌మాకాతో ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించిన శ్రీలీల అందరి దృష్టిని త‌న వైపుకు తిప్పుకుంది.సినిమా యూనిట్ అంద‌రి క‌న్నా శ్రీలీల‌నే మంచి పేరు తెచ్చుకుంద‌ని అంటున్నారు. ముఖ్యంగా ఆమె ఎంట్రీ, డ్యాన్స్ తో పాటు ప‌ర్‌ఫార్మెన్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోయారు. ఆమె నటనకు, స్క్రీన్ ప్రజెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. రానున్న రోజుల‌లో శ్రీలీల రష్మిక, పూజల తర్వాత టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లీగ్‌లోకి ప్రవేశించడం ఖాయం అని కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు. ప్రస్తుతం, ఆమె చేతిలో 4 సినిమాలు ఉన్నాయి, అందులో అగ్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్’ మరియు అనేక ఇతర బ్యానర్‌లు కూడా ఆమెతో ఒప్పందం చేసుకోబోతున్నాయ‌ట‌.

Sree Leela craze increases she is the demanding actress
Sree Leela

ధ‌మాకా చిత్రానికి శ్రీలీల 40 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్. ప్రజంట్ ఒప్పుకున్న సినిమాలను 1 కోటికి ఓకే చేసిందట. అయితే వెంటనే డేట్స్ అడ్జెస్ట్ చేస్తే.. రూ. 1.5 కోట్లు ఇస్తానని ఓ నిర్మాత ఆఫర్ ఇచ్చాడని టాక్. డాక్టర్​ కాబోయి యాక్టర్​ అయ్యామని చాలా మంది యాక్టర్స్ చెప్తూ ఉంటారు. కానీ తాను మాత్రం ఎంబీబీఎస్‌ చదువుతూనే మూవీస్ చేస్తుంది. ఇటు చదువు – అటు సినిమా రెండిటినీ బ్యాలెన్స్ చేయడం అలవాటైపోయిందని వివరించింది. ఇంత బిజీ షెడ్యూల్స్‌లో ఆమె స్టడీస్‌కు కూడా టైమ్ కేటాయించడం గొప్ప విష‌యం అని చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago