IND Vs BAN : భారత్- బంగ్లదేశ్ రెండో టెస్ట్ ఎంతో రవసత్తరంగా సాగగా చివరికి భారత్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో బంగ్లాదేశ్ సీరిస్ ను క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు దాదాపు టీంఇండియా చేయ్యి జారిపోతున్న సమయంలో టెయిలెండర్స్ దూకుడుగా ఆడటంతో మ్యాచ్ ఇండియా వైపు టర్న్ అయ్యింది. ఉత్కంఠ పోరులో బంగ్లా దేశ్ పై భారత్ 3 వికెట్ల తేడాతో విజయం సాదించడం ద్వారా.. సీరిస్ ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.
బంగ్లాదేశ్ నిర్దేశించిన టార్గెట్.. 145 రన్స్ ను చేధించడానికి టీంఇండియా బ్యాట్స్ మెన్స్ చాలా తీవ్రంగా శ్రమించారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ.. 4 వికెట్లు నష్టానికి 45 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగురోజు ఆట ప్రారంబించిన భారత్.. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో అయ్యర్ ( 29) , అశ్విన్ ( 42) నిలకడగా ఆడుతూ 71 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి.. మ్యాచ్ ను పూర్తిగా టర్న్ చేశారు. దీంతో బంగ్లాపై ఇండియా విజయం సాధించింది. అశ్విన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా, పుజారాకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందించారు.
అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 314 పరుగులకు ఆలౌట్ అయింది. పంత్ 93, శ్రేయాస్ అయ్యర్ 87 పరుగులతో రాణించారు. కెప్టెన్ రాహుల్(10), శుభమన్ గిల్ (20), పుజారా (24) కోహ్లీ (24) దారుణంగా విఫలమయ్యారు. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఇక బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (3/68), సిరాజ్ (2/41), అశ్విన్ (2/66) రాణించారు. బంగ్లా విషయానికి వస్తే.. లిటన్ దాస్ (73; 98 బంతుల్లో 7×4) జాకిర్ హసన్ (51; 135 బంతుల్లో 5×4), నురుల్ (31), తస్కిన్ అహ్మద్ (31 నాటౌట్)ల పోరాటం చేయడం వల్లనే బంగ్లా ఆ మాత్రం స్కోర్ సాధించగలిగింది. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ 5 వికెట్లు తీశాడు. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు వికెట్ తీశాడు.
అయితే ఎలాగోలా మ్యాచ్ గెలిచినప్పటికీ టీమిండియాపై విమర్శలు తప్పడం లేదు. ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్ యాదవ్‌ను పక్కన పెట్టడం పెద్ద మిస్టేక్ కాగా.. ద్రావిడ్ కోచింగ్ అసలు ఏమీ బాగా లేదని.. కేఎల్ రాహుల్ ఇండియా పరువును దిగజార్చాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ద్రావిడ్ వెంటనే కోచ్‌గా తప్పుకోవాలని.. కేఎల్ రాహుల్ కు ఇకపై ఎప్పుడూ కెప్టెన్సీ ఇవ్వొద్దని అంటున్నారు. మరి బీసీసీఐ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…