Sr NTR Rs 100 Coin : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా రూ.100 నాణాన్ని రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. జేపీ నడ్డా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు – భువనేశ్వరి, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి – వెంకటేశ్వరరావు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, కల్యాణ్ రామ్ హాజరయ్యారు. అలాగే టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, ప్రముఖ సినీ నిర్మాతలు అశ్వినీదత్, దగ్గుబాటి సురేశ్‌బాబు, ప్రముఖ వ్యాపారవేత్త చల్లా రాజేంద్రప్రసాద్, టీడీపీ నేతలు అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోన్‌రావు, ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెలు, వారి కుటుంబ సభ్యులు, మనుమలు, మనుమరాళ్లు పాల్గొన్నారు.
దాదాపు 200 మంది అతిథులకి ఈ కార్యక్రమంకి ఆహ్వానం అందింది. అయితే ఎన్టీఆర్ 100 రూపాయల నాణేలను విడుదల చేసే కార్యక్రమానికి ఆహ్వానం పంపలేదని ఏపీ తెలుగు, సంస్కృతిక అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ భార్యగా నాణేల విడుదల కార్యక్రమానికి హాజరయ్యే హక్కు తనకు ఉందని లక్ష్మీపార్వతి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇక కేంద్ర ప్రభుత్వం ముద్రించిన ఎన్టీఆర్ రూ.100 నాణెం మొత్తం చుట్టుకొలత 44 మిల్లీ మీటర్లు ఉంటుంది. దీనిని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. నాణానికి ఒకవైపు మూడు సింహాలతోపాటు అశోక చక్రం.. మరోవైపు ఎన్టీఆర్ చిత్రం ఉంటుంది. నందమూరి తారక రామారావు శతాబ్ది వర్ష్ అని హిందీ భాషలో.. ఎన్టీఆర్ శత జయంతి ముగింపునకు సూచికగా 1923 – 2023 సంవత్సరం కూడా నాణెంపై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్‌టీ రామారావుకు భారతరత్న ప్రకటించి, తెలుగు ప్రజలందరినీ సంతోషపర్చాలని, తెలుగు జాతిని గౌరవించాలని కొందరు కోరుతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…