Chiranjeevi : తెలుగు సినిమా ‘పుష్ప : ది రైజ్’తో బన్నీ రికార్డు క్రియేట్ చేశారు. 69 ఏళ్లలో మొట్టమొదటిసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అల్లు అర్జున్ ఉత్తమ నటుడి కేటగిరీలో జాతీయ అవార్డును సొంతం చేసుకొని అందరిచేత ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. 2021వ సంవత్సరానికి గాను సినీ జాతీయ అవార్డ్స్ ను కేంద్ర ప్రభుత్వం ఈనెల 24న ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప : ది రైజ్’ చిత్రాలు సత్తా చాటాయి. ఆర్ఆర్ఆర్ కు ఆయా కేటగిరీల్లో ఆరు అవార్డులు దక్కగా పుష్ప చిత్రం మాత్రం ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ కు, బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కు అవార్డులను అందింది.
తొలిసారిగా బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డును అల్లు అర్జున్ అందుకోవడంతో సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. మెగా ఫ్యామిలీతో పాటు సెలబ్రెటీలు, అభిమానులు సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో అత్యుత్తమ పర్‌ఫార్మెన్స్ కనబరచగా, ఆయనకి రాకపోవడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు అల్లు అర్జున్ కి వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ అంతటి వ్యక్తి నుంచి బన్నీకి అదిరిపోయే విధంగా అభినందనలు దక్కాయి.
నేషనల్ అవార్డు ప్రకటించిన తర్వాత తొలిసారి బన్నీ చిరంజీవిని కలిశారు. మేనల్లుడిని హత్తుకొని స్వీట్ తినిపించి ఫుల్ ఖుష్ అయ్యారు. తన కొడుక్కి రాకపోయిన మేనల్లుడికి అవార్డ్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు మెగాస్టార్. ప్రస్తుతం బన్నీ, మెగాస్టార్ ఖుషీ మూమెంట్స్‌కి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ ..చిరంజీవి, సురేఖ దంపతులతో ఉన్న ఫోటోస్ కూడా ప్రస్తుతం మెగా అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు సాధించడం పట్ల సురేఖ సంతోషం వ్యక్తం చేస్తూ బన్నీని ఆప్యాయంగా హత్తుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…